చలి తెరలు
Image Courtesy: The Hindu |
ఉదయం మంచు పల్లకి లో తేలియాడుతూ ఉంది ... కళ్ళకు కట్టినట్టు ఆ మేఘమాల నేడు పొగ మంచునే అచ్చాదానంగా చేసుకొని ఇల పై ఇలా వాలినట్టు ఎటు చూసిన పొగ మంచు తెరలు అల్లుకున్నాయి
కమ్మని ఈ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ అలా చక్కర్లు కొడుతూ ఉంటె ఆ చలి లో చలి మంటలు వేసుకుని పోగేసుకున్న మనుషులు తరాస పడుతారు . వేకువలో కూడా చల్లగా చేసే శీతాకాలం ఇలా మనముందు ప్రత్యక్షం అవుతుంది ... చల్లని గిలిగింతలు పొగమంచుల కవ్వింతలు చలి మంటల పరిచయాలు ... నిద్రలేచిన మంచం దిగడానికి వీలు పడని చలి తెరలు ... మంచులో ప్రయాణాలు ఆహ్లాదభరిత వాతావరణం లో చేసే విహార యాత్రలు మన అందరికి ఏంటో నచ్చే రోజులు ఇవే సుమండీ ...!
చలి తెరలు ఋతు రాగాలు చల్లదనం లో వెచ్చదనం కోసం పడే పాట్లు హాయిగా మురిపెంగా వినోదంగా అనిపించే ఆ మధుర క్షణాలు ... చలి తో ఆత్మీయ అనురాగాలు ప్రక్రుతి తల్లి మనకు అందించిన అపురూప బహుమానం.