పూదోట

ఇమేజ్ కర్టసీ: crazyfrankenstein.com
విరివిగా విరిసిన విరితోట లో అరవిరిసిన వ్యత్యాసం లేని విరులం 
మనసునేరిగి మమతానురాగాలు పంచె మానవత్వానికి తలమానికాలం
గుండె అంచులు దాటి పొంగి పొరలే ప్రేమలకు ప్రతీకలం
నవ సమాజ నిర్మాణ సారథులం తోబుట్టువులం అన్న చేల్లెల్లం
||విరివిగా||

ఎడారి దారిలో ఎందమావులం
మంచు తెరల చాటు ఆదిత్యుని కిరణాలం
బంధాలకే బాంధవ్యం నేర్పించే అపురూప చిరునామలం
తరతరాలు నిలిచిపోయే అభిమానానికి వారధులం
||విరివిగా||

వెన్ను తట్టి ప్రోత్సహించే పెన్నిదులం
వెను  వెంటే ఉండి  ముందుకు నడిపించే ఊతలం
ప్రేమకు ఆప్యాయతకు నిఖార్సైన గురుతులం
అలుపులేని ఆనందాలకు సఖ్యాతకు దేవుడు పంపిన ప్రాణ స్నేహితులం
ఒకే రాగం ఆలాపించే ఒకే గూటి గువ్వలం

||విరివిగా||

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల