భావం

కోటి రాగాలు పలికే సంజీవని ఇది
అనంత కోటి భావాలు విరబూసే తోట ఇది
కుసుమ మేలిత సుగంధాలు వెదజల్లే సుమాల మాలిక ఇది

నిండుకొని భావాలు జాలువారే జలపాతం ల ఎగసి పడే కెరటానికి సమతూకంగా నిలిచే అపురూపం ఇది
భావం భావనాలు భవ్య రాగాలాపనలు స్వరసందులు  చిరు చిరు దీపికల కలయికల సమాహారం ఇది
ఎప్పటికి చివురులు తొడిగే మనోభావాల వృక్షం ఇది సంభావన సద్భావన కలగల్పిన అపురూప ఘట్టం ఇది
వెన్నంటి నడిపించే ప్రకృతి  సోయగాలలో దాగి ఉన్న అందాల భరిణ ఇది

ఉప్పెన ల ఎగసిపడే భావాల తరంగమే ఇది

Popular Posts