Niharika

నా భావాలన్నిటిని నేను నాలోనే దాచుకున్న ఇన్నాళ్ళు 
అవన్నీ మంచు కొండల్ల చల్లగా నా మదిలో దాగి ఉండేవి 
ఈ నాడు అవి కరిగి చిన్ని సెలఎరులై ఓ ప్రవహించే నది అయి 
ఉరకలు పరుగులు పెడుతూ ఉంటె ఎందుకిన్నాళ్ళు ఇలా దాచాననిపించింది

ఎదలో మలినలున్న ఈ  అమృతపు దారలో కడిగిన ముత్యము వలె నిగారింపు సంతరించుకుంది
మంచు కొండల్లో చలనం లేని నిహారికలా ఓ సుమ మాలిక ల నన్నివేళ అల్లుకుంది ఆ భావన
మనసు ఎంత ధవళ కాంతుల్లో ధగ ధగ మన్న కోప తాపాల హోమ గుండం లో అవి పది ఆవిరి కానివ్వను
సెలయేటికి కొండలు కొనలు లెక్క కాదు నా కవిత్వ సెలయేటికి భాస భేదం లెక్క కాదు
అన్నిటికి మించి రాగద్వేషాలకు తావులేని చల్లని కావ్య మాలిక ఇది.

Popular Posts