తపన

రోజు అలానే తెల్లవారుతూ ఉంది అలానే చీకటి పడుతూ ఉంది ... ఈ రేయి చీకటికి ఆ పగటి వెలుగుకి ఎంతో  వ్యత్యాసా ఉంది కాని ఆ వెలుగు కి ఈ చీకటికి మధ్యన ఏదో చెయ్యాలని తపన
హాయికలిగితే నవ్వగలిగే మనస్తత్వం ఉంది బాధగా ఉన్నపుడు ఎవరికైనా చెప్పి సాంత్వన పొందే అవకాశం ఉంది .. ఈ ఇరు భావాల మధ్య సగటుగా ఉత్సాహంగా ఉండాలని ఏదో తపన

ఈ జీవితం మనల్ని వెతుక్కుంటూ రాదు మనకి దేవుడు ప్రసాదించే ఊ అవకాశం ఓ వరం
నిరుత్సాహానికి ఉత్సాహానికి మధ్య  ఏమైనా ఉన్న మన మనసులో మెదిలే భావాల కలయికే సుమీ
నిట్టూర్పులు ఉన్న ఆహ్లాదంగా ఉండాలన్న భావనే మనిషిని మనిషిగా గుర్తిమ్పునిస్తుంది
అల ఉప్పెన లో ఉన్న తపన కొద్ది ఒడ్డుకి వస్తు ఉంటుంది మన మనసుకూడా అపుడప్పుడు తడబాట్లను తట్టుకో గాలిగే ఓ ఆశల కడలి లా పెను సంద్రం ల మారాలి

అలా మారితేనే జీవికి జీవించాలనే తపన యద నుండి పొంగుకు వస్తుంది  మన చుట్టూ ఉన్న ఈ లోకం మన మీద నిందలు వేసిన వాటిని భరించే శక్తి ఆ దేవుడు మనందరికీ ఇస్తాడు ... సరైన సమయం లో అది వాడుకుంటే ఈ లోకాన్ని జయించినంత సంతోషం మనకు కలుగుతుంది అదే జీవిగా ఓ మనిషిగా మనం అందవేసే ఓ చిరు స్వప్నం.

ఆ చిరుస్వప్నాన్ని అందుకోవాలని జనాల మనసులో ఎప్పటికిలాగే ఉండిపోవాలని ఓ చిన్ని తపన ఈ కావ్యాల ఝారి నా ఈ కావ్యాంజలి. సకల విషయాల మాలిక ఈ అంతర్జాలం లో ఓ అపురూపమైన ఆణిముత్యం లా అందరి మనసులు కొల్లగొట్టి అందరి మన్ననలు అందుకోవాలని ఓ తపన . ఈ అంతర్జాలం లో ఇది నా నురవ కవిత. కాని నా మనసులో మెదిలే భావాలతో పోల్చితే ఇది చాల తక్కువ.

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల