Posts

Showing posts from November, 2012

పూదోట

Image
ఇమేజ్ కర్టసీ: crazyfrankenstein.com విరివిగా విరిసిన విరితోట లో అరవిరిసిన వ్యత్యాసం లేని విరులం  మనసునేరిగి మమతానురాగాలు పంచె మానవత్వానికి తలమానికాలం గుండె అంచులు దాటి పొంగి పొరలే ప్రేమలకు ప్రతీకలం నవ సమాజ నిర్మాణ సారథులం తోబుట్టువులం అన్న చేల్లెల్లం ||విరివిగా|| ఎడారి దారిలో ఎందమావులం మంచు తెరల చాటు ఆదిత్యుని కిరణాలం బంధాలకే బాంధవ్యం నేర్పించే అపురూప చిరునామలం తరతరాలు నిలిచిపోయే అభిమానానికి వారధులం ||విరివిగా|| వెన్ను తట్టి ప్రోత్సహించే పెన్నిదులం వెను  వెంటే ఉండి  ముందుకు నడిపించే ఊతలం ప్రేమకు ఆప్యాయతకు నిఖార్సైన గురుతులం అలుపులేని ఆనందాలకు సఖ్యాతకు దేవుడు పంపిన ప్రాణ స్నేహితులం ఒకే రాగం ఆలాపించే ఒకే గూటి గువ్వలం ||విరివిగా||

वक़्त

आज न जाने क्यों एक ऐसा माहोल चा गया है मानो कभी किसी वक़्त पर किसी मोड़ पर  कोई अनजाना पल सा मेरे आगे से होकर गुजर रहा हो इन्ही आँखों में एक नयी झलक सी आ  गयी है लेकिन बस चलता चल राही किसी एक न एक  तौर पर न जाने कहीं कोई अपना जो कभी पहले हम से मुलाक़ात न हो आ जाए   अचानक सी उसे देख हैरान न रह जाना वक़्त ही हमारा प्रश्न है और वक़्त ही उसका उत्तर अब तुम्हे छोड़ चले आये हम इतने दूर की न जाने तुम अब किस मोड़ में ठहर गयी एह तो मुझे पता ही न चला ... ठहरा हुआ सा दिखा वक़्त न जाए कब इतनी दूर हमें लेके  आ गया अब उन बीते पलों से हमे क्या लेना देना ... जो अब और बाकी है उससे हम को आगे बढ़ना चाहिए वक़्त की इस मुश्किल राहो में कहीं न कहीं तो आशा की रोशन आ पड़ती है उसी की तरफ हमें  जाना है ... न जाने किस मोड़ पर हमे और कोई मिल जाए

భావం

కోటి రాగాలు పలికే సంజీవని ఇది అనంత కోటి భావాలు విరబూసే తోట ఇది కుసుమ మేలిత సుగంధాలు వెదజల్లే సుమాల మాలిక ఇది నిండుకొని భావాలు జాలువారే జలపాతం ల ఎగసి పడే కెరటానికి సమతూకంగా నిలిచే అపురూపం ఇది భావం భావనాలు భవ్య రాగాలాపనలు స్వరసందులు  చిరు చిరు దీపికల కలయికల సమాహారం ఇది ఎప్పటికి చివురులు తొడిగే మనోభావాల వృక్షం ఇది సంభావన సద్భావన కలగల్పిన అపురూప ఘట్టం ఇది వెన్నంటి నడిపించే ప్రకృతి  సోయగాలలో దాగి ఉన్న అందాల భరిణ ఇది ఉప్పెన ల ఎగసిపడే భావాల తరంగమే ఇది

Happy Deepawali

ఈ చక్కని దీపావళి మన ముంగిట దీపమాలిక ల మన ప్రేమానురాగాలను ప్రసరింప చేయాలని దుఖం కలహం కల్మషం బాధ అనే నిశినుంది జ్ఞానజ్యోతులు తిమిరాంతకాలు గ మారి సంతోషం సుఖ సుఖ్యాలను మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ ... కావ్యాంజలి వీక్షకులకు కవి ప్రేమికులకు నా తరపున వెయ్యి వెలుగులు ప్రసరింప చేసే దీపావళి శుభాభినందనలు. Wishing you all a Very Happy ,Bright and Safe Deepawali %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%~* ((@))~* Sridhar Bukya

చలి తెరలు

Image
Image Courtesy: The Hindu చేతులు చల్లగా మారాయి .. చందురుడు నిషి రాత్రి లో మసకగా కనిపిస్తున్నాడు ఉదయం మంచు పల్లకి లో తేలియాడుతూ ఉంది ... కళ్ళకు కట్టినట్టు ఆ మేఘమాల నేడు పొగ మంచునే అచ్చాదానంగా చేసుకొని ఇల పై ఇలా వాలినట్టు ఎటు చూసిన పొగ మంచు తెరలు అల్లుకున్నాయి కమ్మని ఈ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ అలా చక్కర్లు కొడుతూ ఉంటె ఆ చలి లో చలి మంటలు వేసుకుని పోగేసుకున్న మనుషులు తరాస పడుతారు . వేకువలో కూడా చల్లగా చేసే శీతాకాలం ఇలా మనముందు ప్రత్యక్షం అవుతుంది ... చల్లని గిలిగింతలు పొగమంచుల కవ్వింతలు చలి మంటల పరిచయాలు ... నిద్రలేచిన మంచం దిగడానికి వీలు పడని  చలి తెరలు ... మంచులో ప్రయాణాలు ఆహ్లాదభరిత వాతావరణం లో చేసే విహార యాత్రలు మన అందరికి ఏంటో నచ్చే రోజులు ఇవే సుమండీ ...! చలి తెరలు ఋతు రాగాలు చల్లదనం లో వెచ్చదనం కోసం పడే పాట్లు హాయిగా మురిపెంగా వినోదంగా అనిపించే ఆ మధుర క్షణాలు ... చలి తో ఆత్మీయ అనురాగాలు ప్రక్రుతి తల్లి మనకు అందించిన అపురూప బహుమానం.