Posts

Showing posts from June, 2019

50th Day

సప్తవర్ణాలన్ని కలగలిపి చిరుచినుకుల చిటపట హోరులా అష్టైశ్వర్యాల అష్టలక్ష్మీ స్వరూపమే మువ్వలు గట్టి నడయాడ ఉంగా ఉంగా మొదలుకుని  ముదుముదు మాటల మూటగా నాన్నకుచి అమ్మకుట్టి నానమ్మ తాతయ్యల ఆశిర్వచనాల గారాలపట్టిగా సంతోషాలన్ని తన చిన్ని పిడికిలిలో బంధించిన ఆత్మికయై నవరాగాల సమ్మిలిత భావోద్వేగానికి మమల్ని లోను జేసి మా ఇంట కొలువు దీరిన కనకదుర్గక్క చల్లని దీవెనగా ఈ శ్రీధరనితల కంటిపాపగా ఏడుకొండల ఆసామి అభయమై నవ్వుల పువ్వులు పూయిస్తు తన ఇద్దరు మేనత్తల మేనకోడల్ చూచూలు

మూర్ఖత్వం

ముర్ఖత్వమనే గొడుగు కంటే ఆప్యాయత అనే మబ్బులు అపారమైనవి. గొడుగుకు చిల్లుపడితే తడిసిపోవటం ఖాయం.. మేఘానికి చిల్లుపడితే తడసిపోవటం ఖాయం.. ఎలా చూసినా చివరాఖరి గెలుపు క్లౌడ్ దే..

తేడ

మీవారు మీపై అమితమైన ఆప్యాయతను కురిపిస్తుంటే ఆ తడిజల్లుల్లో తడవండి.. మూర్ఖత్వమనే గొడుగును విప్పదీసి అనురాగాత్మీయతకు విఘాతం అంతరాయం కలగించకండి.

అసలైన వారు

మీకంటే ఈ లోకం మొత్తంలో మిమల్ని అమితంగా అభిమానించే వారని తెలిసి కూడా వారి మనసుని గాయపరచవచ్చనే ఆలోచన చేయ్యవద్దు, ఆ స్వచ్ఛమైన మనసులో ఆదరించే సత్తువ తగ్గుముఖం పట్టదు, ఆ నిఃస్వార్థ ప్రేమాభిమానాల ముందు ఎదుటివారి గీర బలుపు పొగరు టెక్కు పటాపంచలే. అందరిది మానవ జన్మే..!

ఆప్యాయత

మీవారు మీపై అమితమైన ఆప్యాయతను కురిపిస్తుంటే ఆ తడిజల్లుల్లో తడవండి.. మూర్ఖత్వమనే గొడుగును విప్పదీసి అనురాగాత్మీయతకు విఘాతం అంతరాయం కలగించకండి.

pch.. the barrier war

shatasahasraadula rokkamu saayam andinchina vaarine maruvadalachi vaarikantenu droham jesina vaari koraku itula vegirammantire.. ingitamanu ledu lessa.. krutajnata bhaavammu ledu netula vuntire kathora buddhi nanusarincha mahadeva emani varnintume bhaavaaniki sarileni padaalu kurcha.. vekkirintayo badalika sadalikalenni unnanu.. mannasaakshi eduta nirveeryamagune.

Fathers' Day 2019

with chuchulu, celebrating first fathers' day of my life this year. to every father, who constantly inspire and motivate by being an example all throughout the life, in one way or the other. wishing a happy fathers' day today.

transformation

transformation is not a rapid and spontaneous process: from being an ugly larva, to a beautiful butterfly, it all takes perseverance and stability and rigorous manipulation with controlled improvement on an floating timestamp. dharAni 15.06.2019

వివరణ

నేను సంజాయిషి ఇచ్చుకునేంత తప్పు ఏమీ చేయలేదు. సహజంగా హిందు సాంప్రదాయం ప్రకారం భర్త ఎక్కడుంటాడో అక్కడే భార్య ఉండాలి.. సీతరాముల కాలం నుండి తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది. కన్న కూతురికి వివాహం చేసి తన చేతిలో తన స్తోమతకు తగ్గకుండా ఏ తండ్రైనా సారే పంపుతాడు. కాని నా భార్యకు తన తండ్రి ఇచ్చిన సారే చిరిగి ఉన్న పాత బట్టలు.. అవే మోసుకొచ్చింది. సరే అనుకున్నాను. సంసారమంటే గిల్లికజ్జాలున్నా వాటిని మనసులో పెట్టుకోకుండా సర్దుకోవాలి. మొదటి కాన్పు పురుడు కని తన పుట్టింటికి పయనమైన ఆలి.. తన వారు దగ్గరుండి ఏమి చేయించకపోయినా వాళ్ళంటే తనకంత ఆత్మీయత.. రేయిలో కునుకు రాక రెప్ప వాల్చకుండా తనకు పురుడు సవ్యంగా జరగాలని ఆసుపత్రులు తిప్పి తీరా అడ్మిట్ చేయండి మామ అంటే డబ్బులేదల్లుడు నువ్వే వచ్చి కట్టు అంటే ఏ అల్లుడు దిగిరాడు.. కాని నేను అడ్మిషన్, సిజేరియన్, డిస్చార్జ్ అన్ని దగ్గరుండి చూస్కున్నా కాని నాపై మాత్రం రవ్వంతైనా అభిమానం లేదు తనకి. మన ఇంటికొచ్చేయంటే సాకులు వెతికి మూడు నెలలయ్యాక వస్తాననటం తనకి వివేకంగానే అనిపించచ్చు.. కాని తన గూర్చి తన కుటుంబం పట్ల ఉన్న ఆదరణ ఏరోజు అణగారనీయలేదు.. పాప పుడితే తన పేరిట పాతికవేలు...

అర్దం అనర్దం

భాషకు భావం తోడు లేకపోతే అర్దమే వ్యర్దం నిప్పుకి నీరు కాక ఉప్పు తోడైతే అనర్దం

అపరిపక్వత

సమాజంలో రెండు రకాల మనస్తత్వం గలవారు ఉంటారు.. కొందరు పిసరంత సాయం చేసినా అపరంజివలే జీవితాంతం భావిస్తారు..!! మరి కొందరు.. కొండంత అండగా ఉండి సాయం చేసినా మంచుబిందువలే భావించి వారి అపరిపక్వతతో ఆవిరి చేసేస్తారు..!

కల కళ

ఒకరి లోటుపాట్లు ఒకరు ఎత్తి పొడుచుకోక సజావుగా జీవితం సాగడమనేది ఒక కల అడపదడప గిల్లికజ్జాలున్నా మనసునెఱిగి ఒకరినొకరు అర్దం చేసుకుని అన్యోన్యంగా జీవించటం ఒక కళ

Anger

Anger, although seems free, but costs one much more than anticipated and ruins whatever comes in it's way. : Conversly : Happiness, although seems costly, but is worth it's presence and helps keep up worthy moments to count upon, and builds good relations. : Annoying Notorious Grumpy Erratic Rampant Healthy Amicable Peerless Poignant Yielding

bahuparaaq

ninnu aadarinche vaaru prati okkaru neevaaru kaakapovachchu.. kondariki nee maatalante istamai vundochchu.. kondaru neekula vundaalani ninnu aadarinchavachchu.. mari kondaru ninnelaa debbateeyaalaa ani avakaasam kosam ninnu aadaristhunatlugaa natinchavachchu.. edemainapatiki paivaadu anni gamanisthoone vuntaadu.. manchainaa chedainaa berizu vesthu vuntaadu..!

చూచూలు

చిట్టితల్లి.. అల్లారు ముద్దుల గారాలపట్టివి నువ్వు.. అమ్మ పొత్తిళ్ళలో హాయిగా సేదతీరి.. నాన్నగా నన్ను మలచి.. చిరునవ్వులొలికించగ దివి దిగివచ్చిన దేవకన్యలా.. మా ఇద్దరికే కాక మా ఇరుకుటుంబాల సఖ్యతను నిలపడానికి తరలివచ్చిన ఓ ఆశకిరణమై.. నీ పాదల అందియల ఘల్లులతో ఈ నాన్న మనసు నిండగా.. నీ పలుకులు విని మీ అమ్మ కల పండగా.. ఎల్లకాలం నీ చల్లని చిరునవ్వులకు రక్షణకవచమై.. నీ మోముపై వసివాడని పసి పసిడి నవ్వుల తేజోదీప్తరమణీయమై నీవు మా ఇంటికే వన్నె తెచ్చే కూతురివై.. నాన్న ఆశిస్సులతో పాటు.. అమ్మ దీవేనలు.. నాన్నమ్మ తాతయ్య ల ఆశిర్వచనాలతో.. అమ్మమ్మ తాతయ్యల మురిపెంతో.. మా ఇంట నవ్వుల పువ్వులు పూయిస్తు చల్లగా వర్ధిల్లాలని త్రికరణశుద్ధితో నిన్ను ఆశీర్వదిస్తు.. నీ నాన్న.. ఈ కావ్యాన్ని రచించానమ్మ.. మా "చూచూలు" దీర్ఘాయుష్మతిభవ.. మీ అమ్మ నాన్న అనిత శ్రీధర్. ఒన్ మంథ్.. 💕