వివరణ

నేను సంజాయిషి ఇచ్చుకునేంత తప్పు ఏమీ చేయలేదు. సహజంగా హిందు సాంప్రదాయం ప్రకారం భర్త ఎక్కడుంటాడో అక్కడే భార్య ఉండాలి.. సీతరాముల కాలం నుండి తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది.

కన్న కూతురికి వివాహం చేసి తన చేతిలో తన స్తోమతకు తగ్గకుండా ఏ తండ్రైనా సారే పంపుతాడు. కాని నా భార్యకు తన తండ్రి ఇచ్చిన సారే చిరిగి ఉన్న పాత బట్టలు.. అవే మోసుకొచ్చింది. సరే అనుకున్నాను.

సంసారమంటే గిల్లికజ్జాలున్నా వాటిని మనసులో పెట్టుకోకుండా సర్దుకోవాలి. మొదటి కాన్పు పురుడు కని తన పుట్టింటికి పయనమైన ఆలి.. తన వారు దగ్గరుండి ఏమి చేయించకపోయినా వాళ్ళంటే తనకంత ఆత్మీయత.. రేయిలో కునుకు రాక రెప్ప వాల్చకుండా తనకు పురుడు సవ్యంగా జరగాలని ఆసుపత్రులు తిప్పి తీరా అడ్మిట్ చేయండి మామ అంటే డబ్బులేదల్లుడు నువ్వే వచ్చి కట్టు అంటే ఏ అల్లుడు దిగిరాడు.. కాని నేను అడ్మిషన్, సిజేరియన్, డిస్చార్జ్ అన్ని దగ్గరుండి చూస్కున్నా కాని నాపై మాత్రం రవ్వంతైనా అభిమానం లేదు తనకి.

మన ఇంటికొచ్చేయంటే సాకులు వెతికి మూడు నెలలయ్యాక వస్తాననటం తనకి వివేకంగానే అనిపించచ్చు.. కాని తన గూర్చి తన కుటుంబం పట్ల ఉన్న ఆదరణ ఏరోజు అణగారనీయలేదు.. పాప పుడితే తన పేరిట పాతికవేలు జమ చేశా.. నా భార్య పురుడు పోసుకుని పాపతో మా ఇంట అడుగిడితే తనకు నచ్చిన నగలు చేయించి ఇస్తా.. అంతే కాని నువ్ అక్కడుండి బాగున్నావ్.. మా కస్టాలు నీకు తెలుసా అంటే.. నాతో పాటు వచ్చేయి నా బిడ్డను తీసుకుని.. మిమ్మల్ని నేను కాచుకుంటా.. అంతే గాని.. అక్కడికేదో.. మీరే న్యాయం చేశారని విర్రవీగితే ఉన్న పరువు ప్రతిష్ట మీరే చేజేతులారా నాశనం చేసుకున్న వారవుతారు.

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం