చూచూలు

చిట్టితల్లి.. అల్లారు ముద్దుల గారాలపట్టివి నువ్వు.. అమ్మ పొత్తిళ్ళలో హాయిగా సేదతీరి.. నాన్నగా నన్ను మలచి.. చిరునవ్వులొలికించగ దివి దిగివచ్చిన దేవకన్యలా.. మా ఇద్దరికే కాక మా ఇరుకుటుంబాల సఖ్యతను నిలపడానికి తరలివచ్చిన ఓ ఆశకిరణమై.. నీ పాదల అందియల ఘల్లులతో ఈ నాన్న మనసు నిండగా.. నీ పలుకులు విని మీ అమ్మ కల పండగా.. ఎల్లకాలం నీ చల్లని చిరునవ్వులకు రక్షణకవచమై.. నీ మోముపై వసివాడని పసి పసిడి నవ్వుల తేజోదీప్తరమణీయమై నీవు మా ఇంటికే వన్నె తెచ్చే కూతురివై.. నాన్న ఆశిస్సులతో పాటు.. అమ్మ దీవేనలు.. నాన్నమ్మ తాతయ్య ల ఆశిర్వచనాలతో.. అమ్మమ్మ తాతయ్యల మురిపెంతో.. మా ఇంట నవ్వుల పువ్వులు పూయిస్తు చల్లగా వర్ధిల్లాలని త్రికరణశుద్ధితో నిన్ను ఆశీర్వదిస్తు.. నీ నాన్న.. ఈ కావ్యాన్ని రచించానమ్మ.. మా "చూచూలు" దీర్ఘాయుష్మతిభవ.. మీ అమ్మ నాన్న అనిత శ్రీధర్.

ఒన్ మంథ్.. 💕

Popular Posts