'హాయి.. మీరు బాగున్నారా.. ఎక్కడి నుండి మీరు' తో మొదలయ్యింది మన తొలి పరిచయం
'మీరు ఏంటి, అండి ఎందుకు.. నువ్వు అను' అనే మాటలతో చాలా దూరం వచ్చేశాం
'మీరు ఏంటి, అండి ఎందుకు.. నువ్వు అను' అనే మాటలతో చాలా దూరం వచ్చేశాం
ఆ దూరం తగ్గించి ఇకనైనా మనం ఇరువురు దగ్గరగా రాలేమా
'మనసేమి బాగోలేదు.. నీ మాటలు వింటే ఏదో తెలియని హాయి' తో మొదలయ్యింది నీ స్వర మాధుర్యం
మాట మాట పెరిగి మన పరిచయం చిక్కబడి ఆ దారికే నీ పేరు పెట్టుకునేంత దూరం వచ్చేశాం
ఆ దూరం తగ్గించి ఇకనైనా మనం ఇరువురు దగ్గరగా రాలేమా
'నీకు నాకు నడుమన సగటున నూట నలభై మూడు కిలోమీటర్లే తేడ'
'రక్తం కూడా నా రకమే, నీకు నాకు తొమ్మిది నెలలే తేడ'
ముక్కలైన గుండె నాదీ నీదీ కూడా అని ఒకరినొకరు చూస్తు చాలా దూరం వచ్చేశాం
ఆ దూరం తగ్గించి ఇకనైనా మనం ఇరువురు దగ్గరగా రాలేమా
నా ఆత్మీయ బాంధవి 'బోలార' కు అంకితం