Posts

Anuraagaalu

జీవితం ఒక్కటే... బంధాలు ఎన్నో భావోద్వేగాలు మరెన్నో జీవితం ఒక్కటే ... రాగ ద్వేషాలు ఎన్నో సరాగాలు మరెన్నో జీవితం ఒక్కటే... భావాలెన్నో కావ్య మాలికలు మరెన్నో జీవితం ఒక్కటే... భావం ఒక్కటే నీలాకాశం ఒక్కటే భావుకత కలబోసినా కావ్యాంజలి భావంవేషణ లో ఎప్పుడు సుడులు తిరిగే ఆలోచనల సరళిలో తేలియాడే మనసు జీవితం ఒక్కటే కాని అది నేర్పే బోధ జన్మంతా గుర్తుండిపోయే ఓ పాఠం

సంక్రాంతి శుభాభినందనలు

తియ్యని చెరుకు గడ లా మన జీవితం తియ్యగా సాగి పోవాలని ఎ కల్మషం లేని స్వచ్చమైన ప్రేమ మన యద లో ఉప్పొంగాలని పంచ భక్ష్య పరమాన్నాల సమానంగా సుభిక్షంగా ఉండాలని ఎలాంటి భేదాభిప్రాయలైన కాలి సమాభిప్రాయలు గా మారిపోవాలని ముంగిట్లో వేసే రంగావల్లికల్ల మన జీవితాలు సుఖ సంతోషాలతో కళకళ లాడాలని నింగి లో ఎ ఆటంకం లేకుండా ఎగిరే గాలి పటాలై మన కీర్తి అంచెలు దాటాలని ఈ పెద్ద పండుగ మన అందరిలో స్ఫూర్తి ని సమ భావాన్ని రేకేతిచాలని మకర సంక్రమణం లాగ దుర్బుద్ధి నుండి సుబుద్ధి కి తామసం నుండి వెలుగు లోకి రావాలని మనసార కోరుకుంటూ కావ్యాంజలి ని వీక్షించే వారికి మరియు అందరికి ఈ సంక్రాంతి శుభాభినందనలు మీ శ్రీధర్ భూక్యా

Jeevana Paramaartham

వెండి వెన్నెల్లో జాలువారే అందం చూసే కంటి కన్నా పరితపించే మనసు కు హాయినిస్తుంది అలలు కెరటాలుగా ఎగసి పడిన దానిలోని భావుకత నిరాడంబరత మంచి భావన తెలుపుతుంది ఎడారి లో మండే ఇసుక రేణువులు సైతం చల్లారి చీకటిలో వెన్నెల తో పోటి పడీ మరి చల్లబడుతుంది కోపావేశం మన దిశ నిర్దేశాలపైనే ఉంది బంధాన్ని నిలుపుకున్దామన్న దాన్ని తెంచే దామన్న వేరెవ్వరు అడ్డు రారు కాని పశ్చాతాపాగ్ని లో మన మనసు కాకవికాలం అయ్యే కొద్ది అందులోని మన కపట స్వార్థం బైట పడుతుంది రాయయిన మంట లో కరిగించి వన్నె తెస్తే బంగారం అవుతుంది దాని విలువ పెరుగు తుంది. ఏమో రేపు కూడా ఈ విలువలేని మనసుకు కూడా అంతటి విలువ వస్తుందో ఏమో . నిన్నటి ఆ చిన్నరే రేపటి ఓ ఉన్నత పురుషునిగా  వెలుగులు పంచ వచ్చును కదా . మోడువారిన కొమ్మ మీద వాలాలంటే పక్షులు జంకుతాయి అదే పచ్చని చివురులు తొడిగిన చెట్టు మీద వాలని పక్షి లేదు. ఉన్ననాళ్ళు బంధాన్ని ఆప్యాయతని అనురాగాన్ని నిస్వార్థ తత్వాన్ని నిరాడంబరతను నిజాయతి గా అందరికి పంచు. నువ్వు పంచిన ఆ మంచితనమే రేపు ఓ చెట్టు గా మొలచి నిన్ను ఆదరించక మానదు. మనిషికి వెల కట్టలేం కాని ఆదర్శ ప్రాయం గా ఉంటె ఆ మనిషి మహోన్నత శికరాలను తాకగల

Time

When time moves on, and when our memories freeze, the door to wisdom never closes. When time moves on, we may change physically, but our emotions and motives do never change. When time moves on, and the life seems boring... Remember Far away there is someone who needs your company. Never Give Up Man Never Give Up. Time does not die at all. Its just a circum-ambulating thing that appears back giving us more challenges to face. We are in this World, where one has to get through hurdles and have to reach zenith. What will you do when you don't find anything that drives you from behind? Never give up buddy Time is always with you.

Niharika

నా భావాలన్నిటిని నేను నాలోనే దాచుకున్న ఇన్నాళ్ళు  అవన్నీ మంచు కొండల్ల చల్లగా నా మదిలో దాగి ఉండేవి  ఈ నాడు అవి కరిగి చిన్ని సెలఎరులై ఓ ప్రవహించే నది అయి  ఉరకలు పరుగులు పెడుతూ ఉంటె ఎందుకిన్నాళ్ళు ఇలా దాచాననిపించింది ఎదలో మలినలున్న ఈ  అమృతపు దారలో కడిగిన ముత్యము వలె నిగారింపు సంతరించుకుంది మంచు కొండల్లో చలనం లేని నిహారికలా ఓ సుమ మాలిక ల నన్నివేళ అల్లుకుంది ఆ భావన మనసు ఎంత ధవళ కాంతుల్లో ధగ ధగ మన్న కోప తాపాల హోమ గుండం లో అవి పది ఆవిరి కానివ్వను సెలయేటికి కొండలు కొనలు లెక్క కాదు నా కవిత్వ సెలయేటికి భాస భేదం లెక్క కాదు అన్నిటికి మించి రాగద్వేషాలకు తావులేని చల్లని కావ్య మాలిక ఇది.

Bandham

మనసులో ఏదో తెలియని అలజడి నన్ను ఎంతగానో మభ్య పెడుతూ ఉంది. తీరాన ఆ అల నా దరికొచ్చి ఏదో విన్నవిన్చోకోవలను కొంటోంది. నిన్నటి ఆ  చెడు నిజాన్ని కక్కాలని ఉన్న ఏదో ఆప్యాయతల వలయం నా గొంతుకలో అడ్డు పడుతూ ఉంది. మనిషి మనిషికి తెడలేన్ని ఉన్న పీల్చే ఉపిరోక్కటే మెలిగే భూమి ఒక్కటే వరసలు బంధాలు మారుతాఎమో ఆ తియ్యని పిలుపు నోచుకునేది ఆ మనిషే. ఈ బంధాలు ఎన్నడు మనిషి అభివృద్ధి కి ఆటంకాలు కావు అవే మనిషి ఎదుగుదలకు సోపానాలు

Bhaja Govindam

౧. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్రింకరణే ౨. మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం ౩. నారీ స్తనభర నాభీదేశం దృష్త్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాదివికారం మనసి విచింతయా వారం వారం ౪. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం సమస్తం ౫. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే ౬. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ౭. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః ౮. బాల స్తావత్ క్రీడాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః వృద్ధ స్తావత్ చిన్తాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః ౯. కా తే కాన్తా కస్తే పుత్రః సంసారో అయమతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చిన్తయ తదిహ భ్రాతః ౧౦. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహ