Posts

సిచువేషన్ సర్కంస్టాంసెస్

అడవికి పోయినా రాముడు రాజే..! జూదంలో ఓడిపోయినా యుధిష్టరుడు రాజే..!! తన బావను గెలిపించటానికి కృష్ణుడంతటివాడే అర్జునుని సారథిగా మారినా అతను రాజే..!!! స్థితిగతులు పరిస్థితులు మన జీవితంతో పోల్చుకుంటే క్షణికాలే..!!!!

abrazo

una persona que sabe el significado de un abrazo sabe que no es solamente el rodear con los brazos a otra persona sino que sus corazones se unan, se reconozcan y latan al unisono. A person who knows the meaning of a hug knows that it is not only around the arms of another person but that their hearts come together, recognize each other and beat in unison.

శ్రీఅనిశ

గత పాతిక రోజులుగా నీ తలపులలో విహరిస్తున్నా నా నిన్ను మరల హత్తుకోవాలని నిదుర మరిచి కలత చెంది పరితపిస్తున్నా నీ ఆ అధరాలలో పనసపండు సువాసన నీ మేను పులకింతలను ఆస్వాదిస్తున్నా మన కంటి వెలుగు చూచూలు పసి ప్రాయపు నవ్వులకై కనురెప్పల అలికిడిలో మమేకమై వేచి చూస్తున్నా నీ హృద్మందిర లయగతులలో సవ్వడి ఉచ్వాస నిఃశ్వాసలతో పోల్చి చూస్తున్నా మన కోపోద్రికాలన్ని ఛిన్నాభిన్నమై నా నిన్ను నీ నన్ను మన సానిహిత్యపు  వెచ్చదనాన్ని చవిచూస్తున్నా నా సగభాగమైన నిన్ను అనుక్షణం ఆరాధిస్తున్నా నా పేరులో సగం నీ పేరులో సగం ఉనికిలో మాత్రం నువ్వు నేను ఎల్లపుడు మనం నా జీవితభాగస్వామి అనితకు మనస్పూర్తిగా అంకితమిస్తు దసరా దీపావళి కలగలసి దాదాపు నెలరోజుల ఆటవిడుపు శ్రీధర్+అనిత=శరణ్య కలగలసి ఏ క్యూట్ ఫ్యామిలి మనమందరం సుఖశాంతులు సిరిసంపదలతో ఎల్లకాలం వర్ధిల్లాలి

Nuv Nen Manam

Guppedu Gunde.. Uppenanta Prema Pidikedu Hrudayam.. Velluvalaa Vaatsalyam Mande Endalu.. Kurise Chinukulu Vaagu Vankalu.. Konda Konalu Navve Pedavulu.. Nadayaade Paadaalu Nuvvu Nenu Manam.. Ninna Nedu Repu Kalakaalam

వివాహ బంధం

చిన్ని జీవితంలో ఏమరుపాటులో తెలిసో తెలియకో పోరపాట్లు సంభవించటం కద్దు.. అటు పిమ్మట వాటిని మన్నించి మంచిగా మసులుకోవటంలోనే ఉంటుంది ఏ బంధానికైన విశిష్టత సంసార బంధం సజావుగా సాగాలంటే అపుడపుడు అలకలు విభేదాలు మనఃస్పర్ధలు సహజం, వాటిని అధిగమించినపుడే ఆ బంధానికి సార్థకత

బావి సంద్రం

ఊట బావిలో నీరు ఊరాలంటే తడి చినుకు తప్పనిసరి. ఆ తడి చినుకు కురవాలంటే సంద్రంలోని నీరే ఆవిరవ్వాలి.

50th Day

సప్తవర్ణాలన్ని కలగలిపి చిరుచినుకుల చిటపట హోరులా అష్టైశ్వర్యాల అష్టలక్ష్మీ స్వరూపమే మువ్వలు గట్టి నడయాడ ఉంగా ఉంగా మొదలుకుని  ముదుముదు మాటల మూటగా నాన్నకుచి అమ్మకుట్టి నానమ్మ తాతయ్యల ఆశిర్వచనాల గారాలపట్టిగా సంతోషాలన్ని తన చిన్ని పిడికిలిలో బంధించిన ఆత్మికయై నవరాగాల సమ్మిలిత భావోద్వేగానికి మమల్ని లోను జేసి మా ఇంట కొలువు దీరిన కనకదుర్గక్క చల్లని దీవెనగా ఈ శ్రీధరనితల కంటిపాపగా ఏడుకొండల ఆసామి అభయమై నవ్వుల పువ్వులు పూయిస్తు తన ఇద్దరు మేనత్తల మేనకోడల్ చూచూలు