కాలం కంటే గొప్పది లేదు. భయం కూడా కొట్టుకు పోతుంది, బాధ కూడా మటుమాయం అవుతుంది. కాని వాటి గురించి తెలిసి కూడా లేనిపోని జంఝాటాలకు తావు ఇస్తుంటాము. భయాన్ని ఉసిగొల్పి ఊరకనే భీతి చెందుతూ మానసికంగా సంతులనం కోల్పోయిన వారమౌతాము.
రోజువారి దైనందిన జీవితాన పుజలు పురస్కారలు కాస్త ఆటవిడుపు ఉరుకులు పరుగులు నిండిన జీవితాన ఉత్సవాల మేలుకొలుపు ఆత్మీయ పలకరింపు నిత్యం దీప ధూప నైవేద్యాదులతో ఎవరికి వారే పూజిస్తున్న వేళ సకుటుంబ సమేతమై జనవాహినిలో మూడేళ్ల కిందట మొదలాయే గణపతి హేల ప్రతి యేట నూతనోత్సాహం మనందరికి ఆశిస్సులే ప్రోత్సాహం దేవాగ్రగణ్య పూజిత అంబాసుత జై మరల వేచి చూసేము నీ ఉత్సవానికై ~శ్రీధర్ భూక్య