ఇదండీ అసలు విషయం

ఏమిటి ఇవాళ్ళ కవితకు బదులుగా శ్రీధర్ ఇంకేదో వ్యాసం రాశాడేంటి అనుకుంటే దానికి కారణం ఇలా :

జనవరి లో ఓ సెమి ఫినిష్డ్ ఇంటిని (అప్పటికి ఇటుకలు పెర్చుతున్నారు , స్లాబ్ పిల్లర్లు వేసి ఉన్నారు ) కొన్నాం, తీర దాన్ని మా సొంత ఊరిలో కొనడము, మేము అక్కడికి 600 కి మీ దూరం లో ఉండడం వలన హౌసింగ్ లోన్ కోసమని ఫెబ్రువారి నేలంతా డాక్యుమెంటేషన్ కె  సరిపోయింది. నాన్న నేను అమ్మ ఆ నేలంతా బ్యాంకు వెంట తిరగడం తోనే సరిపోయింది.

మార్చ్ లో లోన్ సాంక్షన్ అయ్యిందని చెబితే వెళ్లి బిల్డర్ గారికి కొంత సొమ్ము  అప్పజెప్పి, ఇంటి పనులు దగ్గరుండి చక్కబెట్టేటందుకే సరిపోయింది. ఏప్రిల్ లో తిరిగి ఊరు వెళ్లి, పెయింట్ సంగతి, మిగిలిన కన్స్ట్రక్షన్ పనులకోసం ఐపోయింది

ఏప్రిల్ లో బ్యాంకు కు లోన్ లో ఐదో వంతు ఈ ఎమ్ ఐ కట్టిన తరువాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాము. రిజిస్ట్రేషన్ ఐన పిమ్మట ఏప్రిల్ 22 న మా కొత్తింటి గృహప్రవేశం జరిగింది. ఆ తరువాత అక్కడికి మకాం మార్చడానికి ఇంకా ఓ పదేళ్ళు ఉన్నాయని ఆ ఇంటిని బాడుగ ఇచ్చి వచ్చేసరికి మే 02 అయ్యింది. ఇదండీ అసలు సంగతి. కనుకనే ఈ మధ్య కావ్యాంజలి లో టపాల సంఖ్యా కాస్త తగ్గుముఖం పట్టాయి.   

Popular Posts