వేదనకు సాక్ష్యం

మాటే మౌనమై మదిలో ఇలా దాగేనా 
ఋతువులు మారినా పుడమిని తడిమేనా 
కాలగమనమె దరి చేర్చుతుంది ఎవరినైనా 
ఒర్పులో మార్పు రానీకు ఏ రోజైనా

కన్నులు పలికే భాషలు మూడు 
ఆనందం నిండిన కనులను చూడు 
బాధలో ఉన్న కన్నిరుని చూడు 
లోకాన్నే తనలో బంధించే చిన్ని గవాక్షాన్ని పరికించి చూడు 

 వేవేల భావాలతో లయబద్దంగా కొట్టుమిట్టాడుతున్న గుండె సవ్వడి 
కాలానికే అందక పరుగులు తీసేనా ఏమో ఎప్పుడైనా పొరబడి 
కల్మషం ఎరుగని భావన ఏదైనా ఉంటె దాచుకో మదిలో త్వరపడి 
ఒర్పులో చేర్పులో పలుకులో రానీయకు ఏనాడు బాధను వెంటపడి 

కలలరూపం కావ్యాలలో ఇమిడే అక్షరాలగా 
ప్రతి అక్షరం ఓ భావనకు ప్రతీకగా 
మాట మునమైనా మదిలో భావానికి ప్రతిరూపంగా 
వెలిసే నేడు ఇలా  మౌనం నవ్వులు వేదనకు సాక్ష్యం గా  


Popular Posts