బంధమంటే

మిన్నుకి పుడమికి గల బంధమేమి ?
చెలిమి బంధమే కాదా 
కనుకే 
చీకటి వెలుగులు పుడమికి అందిస్తుంది !

సంద్రానికి చంద్రానికి గల బంధమేమి ?
చెలిమి బంధమే కాదా 
కనుకే 
చంద్రుని గమనాన్ని బట్టి అల కదులుతుంది 

సూర్యునికి చంద్రునికి గల బంధమేమి ?
చెలిమి బంధమే కాదా 
కనుకే 
చీకటి లో చిన్నబోయిన చంద్రుని తన వెలుగులు పంచి వెన్నెల కురిపిస్తుంది 

వసంతానికి కోయిలకు గల బంధమేమి?
చెలిమి బంధమే కాదా 
కనుకే 
వసంతాల వేల కోయిల కుహుకుహురాగాలు మిళితం చేస్తుంది 

మనిషికి మనిషికి గల బంధమేమి 
చెలిమి బంధమే కాదా 
కనుకే
ఆప్యాయతతో పలకరిస్తే ఆ బంధమే ఋణానుబంధం అయ్యి నిలుస్తుంది 


Popular posts from this blog

Telugu Year Names

లోలోపల