ఏమని వ్యాఖ్యానించగలను నేను..!
ఏమని వ్యాఖ్యానించగలను నేను..!
నా కనులు చెమ్మగిల్లి చెంపను తాకితే..!!
ఏమని వ్యాఖ్యానించగలను నేను..!
నా మదిలో భావాలన్ని అక్షరాలై ఉరకలేస్తే..!!
ఏమని వ్యాఖ్యానించగలను నేను..!
నా కనులకెదుట జ్ఞాపకాలన్ని కదలాడితే..!!
ఏమని వ్యాఖ్యానించగలను నేను..!
నా మనసే మాటరాకా మౌనాన్ని ఆశ్రయిస్తే..!!