Image Courtesy: Agreeing Tumbler ప్రకృతి తనలో దాగిన అందాలన్నీ ఒక్కొక్కటిగా మనషికి చేరవేసే ప్రయత్నం లో కాబోలు తన ఉనికిని తానే కోల్పోతూ ఉంది స్వచ్చమైన జలపాతాలు సెలయేరులు నదులు మనకు కానుకగా ఇచ్చింది.. మనం మన స్వప్రయోజనాలకై ఆ నీటిని కలుషితం చేస్తున్నాము. ఇది ఎంత వరకు సబబో మనిషిగా పుట్టిన మనకే తెలియాలి ఊపిరి లేని వస్తువేది ఉనికే లేని వస్తువని తెలిసి, నిర్మలమైన వాయువుని, పొగాకు వాయువుతో, నిత్యం రద్దిలై మెదిలే రాజమార్గంలో ధుమశకటాలతో అనునిత్యం కాలుష్యానికి కాలు దువ్వుతున్నాడు బ్రతికున్నన్నాళ్ళు మన కోసమే బ్రతికితే స్వార్థపరులం అంటారే, కాని భావి తరాలు కాలుష్య భూతం విషపు కోరల్లో చిక్కుకుని అలమటిస్తూ ఉంటె నువ్వు తలపెట్టిన కాలుష్య భూతమే వారినావహిస్తే చేసేదేమిలేక తలపట్టుకుంటావా ప్రకృతి వోడిన పుట్టిన మనిషి ప్రకృతి తల్లి అచ్చాదనాన్ని వేరులతో పెకిలించి వెకిలిగా నవ్వుతు 'కాంక్రీట్ జంగల్' ఏర్పచుకుంటుంటే, నిలువు నీడ లేని క్రూర మృగాలు చేరి మనషుల మీద దాడిచేస్తే బాధ్యులు ఎవరు? ప్రకృతి తల్లి మనకు పంచభూతాలను సరి సమానంగా పంచి ఇచ్చింది, ...