నందకిషోర నవనీతచొర
నందకిషోర నవనీతచోర |
నరుని నాటకీయ నిజరూపము నీలాకాశం నుండి నూతిలో నృపమించ నెలవంకతోడ నేరములేలమ్మ నైమిశ నొప్పింపగ నోరుతెరిచి నౌనీతమున్ నందనదనుండ నఃనఃమనున్ నందగోకులమున ఇతగాడిని గొపకిశొరున్ గావక తప్పేనేటులా తెలిసే దారే లేకున్ మాధవా రామాధవ!!
తాత్పర్యం:
నరుని రూపాన ఈ భూమి అను రంగస్థలాన అవతరించి, వైకుంఠ మనే ఆకాశం నుండి భవసాగరముగా గోచరించే నూతి లాంటి ఈ భూలోకమున చంద్రుని లా అవతరించి నైమిశా అరణ్యమున వేచి ఉండే మునులు ఋషులను బ్రోవగ సమయము చేసుకుని ఇలా నీ ముఖములో మా బాధలను ఉపసమనిచ్చే వెన్నలు దొంగలించ నందనందనుడవై ఈ గోకులమున వెలిసి వచ్చితివా. వచ్చి ఈ గోల ఏలా స్వామీ. నీ అల్లరి చేష్టలను కట్టడి చేసే ధైర్యము మరియు దారి మాకైతే ఏమి ఎరుగదు ఓ గోపాల ఇక ఈ మర్మం ఏమిటో నీకే తెలియాలి ముకుంద మాధవ !!
గమనిక: పద్మగారి "న" ప్రయోగానికి గోకులం గోపబాలునికి అంకితమిస్తూ రాసిన "న" గేయం. అర్పిత కవిత నుండి ఆ స్వామిని తలిచే భాగ్యం ఇచ్చిన పద్మార్పిత గారికి ధన్యవాదాలు.