ఏకాకి

Image Courtesy: Worth1000.com
ప్రేమించలేని మనసు ఇలానే ఉంటుంది అన్ని ఉన్న లేనట్టుగా అనిపిస్తుంటది
వానలేని మేఘం ఇలానే ఉంటుంది, కారిపోయిన కన్నీటి చుక్కలా చినుకులు రాల్చుతూ

కరుణలేని హృదయం ఇలానే  ఉంటుంది, మనసు లేని మనిషిలా
జాబిలీ లేని రేయి ఇలానే ఉంటుంది, కాటుక కన్నుల్లో నల్లని రంగులా

తంతిలేని వీణ పలుకనేల రాగాలు మీటిన రాలవు భావాలు
రంద్రం లేని మురళిని ఎంత ఊదిన ఏమి లాభం, రాగం పలుకలేని వెదురు చెక్క మిగిలెను ఓ పక్క

అన్ని ఉంటె సరిపోదు ఈ లోకాన మనిషనే వాడికి మిగితా జంతువులకి ఉన్న తేడల్లా ఒకటే
మనిషి అర్ధం చేసుకుని మసులు కుంటాడు లేనిచో ఇలాటి పూర్తికాని లోకం లో ఏకాకిగా మిగిలిపోతాడు  

Popular Posts