తరగని ప్రేమ
ఇమేజ్ కర్టసీ వర్త్ 1000 |
ఊపిరి బిగపట్టి ఉండగలనా అనిపించింది
అదే తడవుగా ఐదు నిమిషాలు బిగపట్టి ఉన్న
ప్రాణం అంత విలవిలా లాడింది
ప్రాణం విలువ ఏమిటో తెలిసొచ్చింది
నీతో స్నేహం చెయ్యాలని చెయ్యి చాచాను
ససేమిరా అన్నావు ఎక్కడో తాకింది
నిన్ను నాకు దూరంగా కొన్ని నెలలు ఉందామనుకున్నాను
కాని ఏళ్ళు తరబడి నీ ఊహలు నన్ను అట్టే కట్టి పడేశాయి
ఇన్నాళ్ళ మన పరిచయాన్ని పరిచయమే అనుకున్న
ఇది ఓ వీడని బంధం అని నీకు దూరం ఐన కాని నాకు తెలిసిరాలేదు
మన ఆ బంధానికి స్నేహం అని నిర్వచించాను నేను
నన్నొదిలి నువ్వు వెళ్ళాక అర్ధం అయ్యింది అది స్నేహం కాదు ప్రేమ అని