వీటికి సమాధానం నీకే తెలియాలి

అందరికి అంది అందకుండే ఓ ప్రేమ నీకు కొన్ని ప్రశ్నలమ్మ!

ఒంటరి జీవితం లో తుంటరి తలపులు తెప్పిస్తావు ఎందుకమ్మ?
తీరా కలసినాక మొగమాటం బిడియం అంటూ సాకులు ఎందుకమ్మ?

ఏకాకిగా ఎవరిని ఉండనీవు కాదమ్మా మరి నీకా శక్తి ఇచ్చింది ఎవరమ్మ?
రెప్పల కంటిపాపకు కాంతినే కాదు మనసు అద్దం లో భావాలు చూడడం నేర్పింది నీవేకదమ్మ?

మనసులో ఎప్పుడు వచ్చి చేరిపోతావో అది మాత్రం ఎవరికీ తెలుసమ్మ?
నువ్వు ఉన్నవని కనిపెట్టే లోపలే కనుమరుగై పోతావు ఇదేమి చిత్రమమ్మ ?

మనషులు పలికే భాసలో అలకలు కులుకులు తెప్పిస్తావు ఏలనమ్మ ?
అన్ని తెలిసి ఇట్లా వేధించడం అది నీకే తగును ఎలా ఓయమ్మ?

నువ్వు చేరిన క్షణం నుండి నీపైనే ధ్యాస ఎందుకో తెలిదమ్మ ?
ఇలా నన్ను నీలో నిన్ను నాలో చూసుకోవడమే ప్రేమెనేటమ్మ ?

మారు మాటలాడక సమాధానాలు చెప్పవే ఓ ప్రేమ అలక నీకు తగదు గాక తగదు !!  

Popular Posts