రాగ విపంచి
చెల్లాచెదురైన కలలను సైతం ఏర్చి కూర్చి ఇన్నేళ్ళు కూడగట్టిన ప్రేమను ప్రేమలేని /ప్రేమ తెలియని మనిషికి పంచి
ప్రతి గుండె సవ్వడి లో వినిపించే లయగతులు నీవేనని తెలిసి కరుడుగట్టిన నీ హృదయ పాషాణం కరగకున్న వలచి
తెలిసి తెలిసి నా అమాయకత్వాన్ని నువ్వు తూలనాడిన భరించాను భూమిలా ఓర్పు నేర్పు తో నిన్నే నేనేని తలచి
ఇక ఈ కఠోర పదజాలం తో నిన్ను నాకు దూరం చెయ్యాలని కాదు నా మనసులో ఉన్న నీ ప్రేమను తేరిపార పరికించి
నా మనసు కోవెలలో నిన్ను పూజించా, వరమియ్యక ఇలా నా మనసుని ఎల్లవేళలా నీ మాటలతో గాయపరిచి
వెళ్తే వెళ్ళేవు నా మనసు నుండి కాని ఎదురు చూసే కళ్ళల్లో కన్నీరు బదులుగా నీ కలలనే కల్లలు చేసావు నా మాటను వక్రీకరించి
మిగిలావు నువ్వు ఇక నా మనసు మందిరాన ఓ తీపి గురుతుగా మనమేలే ఈ అమూల్య ప్రేమపు రాగ విపంచి
వెన్నెల కిరణాలలో నీ చల్లని మోము చంద్ర బింబమై కదలాడే నా కన్నుల్లో భావాలు కొలిచి
వన్నె తరగని వేళా మనసు మందిరం లో ఏదో తెలియని అలజడి నీవని తెలియక మధన పడ్డ
వ్యాకులతకు నువ్వు చిరునామా కావద్దన్నాను నా ప్రేమను తిరస్కరించి వెళ్ళినావు తస్కరించి
వ్యాకులతకు నువ్వు చిరునామా కావద్దన్నాను నా ప్రేమను తిరస్కరించి వెళ్ళినావు తస్కరించి