ఏ వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా


న్యాయ దేవతకే గంతలు కట్టి దేశాన్ని దోచుకుంటున్నా  
మానవత విలువలు కళ్ళముందే బుగ్గిపాలవుతున్నా
ఆవేదన నిండిన మనసుతో ఏ వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా

కష్టాల కడలిలో  సుడులు తిరుగు కానరాని దుక్ఖఃమేదో జనాలు పడుతూన్నా
కర్కశకఠోరక్షణికావేశాలు మానవీయ విలువలను దెబ్బతీస్తున్నా
బాదతాప్త హృదయం తో ఏ  వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా

మంచితనాన్ని పునాదులుగా చేసి నిర్మించుకున్న ఆవాసానికి బీటలువారుతున్నా
అరాచకాలను ఒక్కొక్కరై ఆపలేక అందరితో కలివిడిగా అన్యాయాన్ని పోరాడలేక
చిన్నబోయిన మోముతో రగిలే గుండెతో ఏ  వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా 

(స్వాతంత్ర్యం వచ్చి నేటికి అరవై ఆరేళ్ళు దాటినా సందర్భం లో నేటి సమాజానికి దర్పణం పడుతూ రాసిన కవనం ఇది. ఇందులో ఎవరిని ఎలాంటి కఠోర పదజాలం తో దూషించలేదని మనవి చేసుకుంటున్నాను)

Popular Posts