అందని 'ఆకాశం'

Image Courtesy: Worth 1000 
అది 05-10-2011 19:10 చుస్తున్నను నేను వార్తలు
కేబుల్ లెకా దురదర్శన్ లో ఎవొ ఛాయలు
అంతలోనే నా మనసుదొచిందో వార్తా
అదే నా చిరకాల కొరికకు తొలి వాతా

'ఆకాశం' నుండి చుక్కలు నేలకు దిగివస్తుందని
వేంటనే తెరిచా ఆ ఆంతర్జాలిక పుటని 27-12-2011 21:15
ఏవో బొమ్మల మధ్యనా ఓ 'ప్రీ-బూక్' లింక్ చూసీ మురిసి ఒత్తాను
వేనువెంటే అడిగి నా విషయాలు కట్టమంది రుసుము

'కళ్ళుమూసి జెల్లా' చందానా అడిగితే ఒప్పకా ఓ మొట్టికాయి వెసాను
'సీ-ఓ-డీ' అని ఇస్తే త్రీ-సహస్రాలు కట్టడం మరువకని ఇచిందో 'ఐడి'
నెలలు గడిచాయి ఉలుకు పలుకు లెదాయే, ఉత్తర-ప్రత్యుత్తరాల్లొ తలమునకలెసి వేసారి
క్యాన్సెల్ చెసెసాను ఆ అందని 'ఆకాశం' తాకే కల కలలానే ఉండిపొయింది అనుకున్నాను

13-08-2013 16:10

హెల్లో అంటు పలికింది ఓ గొంతుకా, "మీరు కోరుకున్న 'ఆకాశాం' మీ అరచేతుల్లో వాలే సమయం ఆసన్నమయ్యిందంటు
ఒకదాని తరువాయి ఒకటి చెప్పుకుంటు పొతొంది ఆ గొంతుక, మారే కాలానికి ఎవ్వరు బాధ్యులు కారని తెలిపి పంచ-సహస్రాలు అయ్యిందంటు కూని రాగాలు
నేను చెప్పెలొపలే భాషా తరంగ యంత్రికను వేలాదేసి బ్లూ-డార్ట్ డీఎచెల్ ఐడీ సందేశం ఒకటి మెరిసింది యంత్రిక మోముపై తళ్ళుక్కు
రేండో రోజు పంచ-సహస్రాల వేటకు ఓ దబ్బా పట్టుకొచ్చి ఇచ్చాడు ముఖకవళికల్లొ ఆనందాన్ని తెలుపుతు 'ఆకాశాన్ని' నా అరచేతుల్లొ పెడుతు

21-08-2013 18:15

విప్పి ఆత్రంగా చూసా, తెల్లమొహం వేసుకుని ఆ యంత్రికా, మోరాయించే చూడూ సామిరంగా
ఏడు అంగుళం అని హితబొద చెసి అంగుళం కూడా నన్ను కదలనివ్వలేదు ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ లా
పంచ-సహస్రాల చేవ్రాలు తెచ్చిపెట్టినా ఉత్తుత్తి తతంగమిదని 'అర్థం' అయ్యెలొగా 'అర్థం' చెయ్యిజారింది
పలుచని ప్లాస్టిక్ కేస్ 'పట్టుకుంటే పదివేలు' చందానా ఆటపట్టించి
నా హావభావాలు అర్దం కానట్టు వింతగా తొచీ ముట్టుకోకు నన్ను అని కసిరింది

కొని 'గంట'ఇనా కాలేదు నా గుండే లో ఏదో 'గంట' కొట్టింది
ఆకాశాన్ని అందుకోవడం అంటే ఏమో అనుకున్నా
దిక్కులు పెక్కటిల్లెలా అరవాలనుకున్నా
కోతలకే కాదు ఇంగితానికి కూడా బుధ్ధి చెప్పాలనిపించింది
'ఆకాశాన్ని' అందుకోవాలనే తపనలొ భు-గురుత్వాకర్షణే గొప్పదని తెలిసి తిరిగి పంపివేశా

Popular Posts