హరి ఓం నారాయణ

అది నైమిశారణ్యం. ఆ అరణ్యం లో సర్వకాల సర్వావస్థలందు సత్సంగం సాగుతూ ఉంటుంది. ఆ సత్సంగానికి సూతుడు నాయకుదు. అతడే వక్త. శౌనకాదులు శ్రొతలు. ఈ సత్సంగంలో అనేక దివ్యక్షేత్రాల ప్రసక్తి ,దెవాధిదెవతల లీలలు కథరుపంలో సూతుడు  శౌనకాదులకు విన్నవించటం పరిపాటి. ఒకనాడు శౌనకాదులు సూతుణ్ణి చూచి
"షడ్గుణాడ్య ! నారాయణస్వరూపుడైన వేదవ్యాసుని సత్కృపతో సర్వస్వము తెలిసిన మహానుభావుడివి. త్రిమూర్తులలో హరి శ్రేష్ఠుడు కదా! ఆ హరికి అండ పిండ బ్రహ్మాండాది లోకాలలో ఏది ప్రియస్థలము? ఎక్కడ హరి స్వయంవక్తుడిగా ప్రకాశిస్తూన్నాడు? సామాన్య మానవులు కూడా దర్శించగల క్షేత్రం ఏది? మాకు తెలియజేయగలరు" అని ప్రార్థించారు. సూతుడు శౌనకాదుల ప్రశ్నను, ఆకాంక్షను మేళవించుకుని స్థిమితకాలము ధ్యానలోచనుడై సమాధిలో మునిగి తదనంతరము శౌనకాదులను చూచి విశదంగా వివరించగలను అని బదులిచ్చాడు.

  ఒకప్పుడు సమస్తము లయమైపోయింది. మహావిష్ణువు వటపత్ర శయనుడైనాడు. కాలం గడచింది. శ్వేతవరాహరూపం ధరించి జలంలోనికి ప్రవేశించాడు. పాతాళంలో దాగిన రుక్మాక్షునితో సమరం సాగించి అతనిని సంహరించాడు. పాతాళం లో ప్రవేశించి కోరలతో 'భూమి'ని ఉద్ధరించాడు. అపుడు బ్రహ్మాది దేవతలు స్త్రోత్రం చేసి పర్వత వనాదులతో సకల చరాచర జంతుజాలంతో 'భూమి'ని శోబితం చెయ్యవలేనని ఆ స్వామిని కోరారు. శ్వేతవరాహమూర్తి సమ్మతించాడు.

     వైకుంఠం నుండి క్రీడాచలాన్ని తెమ్మనమని గరుడుని ఆదేశించాడు. గరుడుడు వైకుంఠానికేగి మూడు యోజనాల వెడల్పు ముప్పది యోజనాల పొడువున్న క్రీడాద్రిని భూలోకానికి తెచ్చినాడు. ఆ క్రీడాద్రిపై శ్వేతవరాహుని రూపాన విష్ణువు కొలువుదీరాడు. ఆ స్వామీ  వైకుంఠము కన్నా వేంకటాచలం ప్రియమని ఇక్కడే శ్రీభూసహితుడనై నిలుస్తానని భక్తులను అనుగ్రహిస్తూ కోరిన కోరికలను తీరుస్తానని అభయమిచ్చి అదృష్యరుపుడయ్యాడు.

    ఆ స్వామియే నేడు ఆనందనిలయదివ్య విమానఛాయలో విరాజమానమగుచు సువర్ణ చిత్రాంబరధరుడుగా, సుభగ దర్శనుడుగా, కంబుగ్రీవుడుగా, పుండరీకవిశాలలోచనుడుగా, కొమలాంగుడుగా, సురుచిర మందహాస సుందర వదనారవిందుడుగా, బ్రహ్మసూత్ర విరాజీతుడుగా, శంఖచక్రగదాధారిగా, జగద్రక్షకుడుగా విరాజిల్లుతున్నాడు. ఈ స్వామీ సందర్శనం ఈ క్షేత్రం లో సంచారం స్వామీ పుష్కరిణి స్నానం కోటి జన్మల పుణ్యఫలం, మన ఈ మానవ జన్మ సార్థకతకు దోహదభూతం.

శ్రీ వైకుంఠ విరక్తయ స్వామీ పుష్కరిణి తటే
రమయా రామమాణాయ వేంకటేశాయ మంగళం 
వినా  వేంకటేశం  ననాథొ న నాథః 
సదా వేంకటేశం స్మరామి స్మరామి 
హరే! వేంకటేశ ప్రసీద! ప్రసీద!
ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ !
అజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్ విహితాన్ హరే 
క్షమాస్వత్వం క్షమాస్వత్వం శేషశైలశిఖామణే

పరిసమాప్తం 
హరి ఓం నారాయణ 
ధరణి-హర్షిత సమేత శ్రీహర్యయి నమః

భాగవత పారాయణం నుండి సంకలితం


సర్వే జనః సుఖినః  భవంతు , సర్వే  సంతు నిరామయాః 

సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఖః భవేత్

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల