జలతారు వెన్నెల

చాన్నాళ తరువాత  నాకు నిన్ను చూడాలనిపించింది
ఎందులోనో రాసుకున్న నీ చిరునామా కోసం వెతుకుతున్న తరుణమది
ఎందుకో మనసు ఆపుకోలేక నీ కలవరింతల్లో మునిగిపోయింది
ఏమీ తేల్చుకోలేక  సతమతమౌతు ఉంది ఇన్నాళ్ళు నీ ఎడబాటు లో

కలకాలం మన స్నేహం ఇట్లానే ఉండాలని కోరుకున్న నేను

కరిగి కనికరం చూపించే సమయాన అందరాని దూరాలకు వెడలిపోయావు
ఇన్నేళ్ళ పిమ్మట మళ్ళి నువ్వు నాకు కనిపించావు మనసు లోలోనే మురిసిపోయింది
ఈ వేకువ కోసమని ఎన్నేళ్ళు ఎదురు చూసానో గురుతే లేదాయే నీ ప్రేమ మాయలో

చిరునవ్వుతో మొదలైన మన స్నేహం మాటల అలల్లో చిక్కి స్నేహపు చివరన ప్రేమ చిగురించి

జలతారు వెన్నెల కురుస్తున్న సమయాన మల్లెల  మాలికల సాక్షిగా వీచే గాలి తడారిపోయింది
చెదురు మదురుగా ఓ మోస్తరు ప్రేమను నాపై నటించి ఆపై వెడలి పోయావు
ఇన్నేళ్ళు నే వేచి చూసింది ఇలాంటి ప్రేమకోసమా
గుండె అలవాటుగా  కొట్టుకోవటం  మాని లయ తప్పింది, నా ఊపిరి లో నీ ప్రేమను నింపి యినేళ్ళు  బ్రతికించింది

నా మనసు గాయపరిచావు అయిన  నాకు నీపైన మచ్చుకైన కోపం లేదు సుమీ ఉన్నతమైన ప్రేమ తప్ప

నీ ఆ ప్రేమని నువ్వు సంద్రం లో ముంచేశావు, మబ్బులై వాన చినుకులై స్వాతి ముత్యమై మెరిసావు
నిండు హృదయం తో నిన్ను ప్రేమించానని చెప్పాలని వస్తున్నా నాకు నువ్వు ఎదురు పడలేదు
గోదావరి ఉరకలు వేస్తూ నీటి మట్టం దాటినట్టు, నాపై నీ  ప్రేమ ఎంతో  కాలం నిలువలేదు!!

Popular Posts