కాలం మారింది

కమ్మని కల ఏదో కనులను మెలకువలోకి తీసుకొస్తుంది
తీర కళ్ళు తెరిచాక ఏముంది ఆనందమంతా ఎగిరి పోతుంది 

పువ్వులను చూస్తె మనసు ఉప్పొంగి పోతోంది 
వన్నె తరగని అందానికి క్షణకాలమే పాశం అవ్వి మరో క్షణం లో వాడి పోతుంది 

మనసులో నిన్ను తలచిన వెంటనే ఎగిరి గెంతాలనిపిస్తుంది
నిరుడు నన్ను వెంటాడిన ఆ నీడని తరమాలనిపిస్తుంది 
తేరిపార పరికించి చూస్తె నువ్వు లేవు నీ ప్రేమ  లేదు భూమి కృంగి పోతుందన్న ఫీలింగ్ ఒకటి 

మనసు నిన్ను మరిచిపోవాలని పాటలు వింటూ ఉంటె 
"ప్రేమ ఎంత మధురం .. అని అభినందన నుండి ఓ రాగం 
కరిగే దాక ఈ క్షణం గడిపేయాలి .. అని ఆర్య నుండి 
 నమ్మక తప్పని నిజమైన.. అని బొమ్మరిల్లు నుండి "
ఇలా ఒకటి వెనకాల ఒకటి ఏడుపు గీతాలే ... విరహ గీతాలే
కాని ఏదో తెలియని ఆర్ద్రత నిండిన మనసు తేలిక పడ్డట్టు అనిపిస్తుంది 

ఏమో ఇది ..  నీతో ప్రేమలో ఉన్నపుడు అన్ని హుషారు గొలిపిన పాటలే 
"ఎల్లువచ్చి గొదారమ్మ.. నుండి నిన్నటి  మై హార్ట్ ఇస్ బీటింగ్ .. నుండి నేటి నిన్ను చూడగానే ..." వరకు 
ఇప్పుడెక్కడ ఉన్నాయవి నీతో పాటుగా కనుమరుగయ్యాయి

మాయ అంతర్జాలం లో ఏమ్మున్నవి చెప్పుకోదగ్గ మార్పు 
మన భావాలనే మనకు అద్దం లో చూస్తూ బాదపడుతూ బాదపెట్టుతూ బాదలోనే సంతోషాన్ని "గూగుల్ " లో "సెర్చ్" చెయ్యమని సలహా ఇస్తుంది. 
ఏమిటో ఈ వింత ప్రపంచం మారిందో లేక మనషులు మారిపోయారు తెలియని సందిగ్ధ స్థితి. 


"మారే కాలం  ఎలా తనతో మనల్ని కూడా తీసుకుపోతుందో అని చెప్పాలన్న తాపత్రయం లో పుట్టిన సమకాలీన కావ్యం ఇది. ఇందులో ఎవరిని ఎలాంటి కటు పదజాలం తో నిందించను లేదు, పాటల పేర్లు ప్రస్తావన యాదృచికం అని  తెలియపరుచుకుంటున్నాను"

Popular Posts