వందే జగన్నాథ

ఓం ధరణి హర్షిత సమేత శ్రీహర్యయి నమః 

వందే  జగన్నాథ వందే ముకుంద
వందే విష్ణో వందే కమలప్రియ గోవింద 

నీ కడు చూపూల కరుణరసము కురిసేనీనాడు
వెలిగేను చూడు జ్ఞాన దీపాలు నిను తలవంగ నేడు
ఓ వేంకటేశా! నీ లీలామృతము ఆనందదాయకము
అసమాన భక్తిభావాలనినుమడింప జెసే ముక్తిప్రదాయకము
నా మదిలో కొలువుదీరితివి నిత్యం నిను కొలువంగ
అనంతకొటీ సుర్యతేజములు నీయందు ప్రజ్వలింపంగ

రామవతారంబున మనుజరూపాన వెలసి
రామరాజ్యపాలన లో ధరణిని తరింపజెశావు
కృష్ణావతారముయందు మురళిగానముజేసి
నిఖిల జగత్తునె వెలిగించె గీతొపదెశము చెశావు

వేంకటేశావతారములొ ఆడిన మాటను మరువనివాడివై
శ్రినివాసునిగా వకుళమ్మ చెంతకు చెరావు
భక్తకొటీ నీరాజనాలు అందుకుని వెలసినావు
తిరుమల శిఖరాగ్రాన లొకేశ్వరేశ్వరా ఉన్ముక్తమనస్కుడవై

లోకంబెల్ల నిను కీర్తింపగ భాసిల్లినావు
కలియుగ ప్రత్యక్ష దైవమై శొభిల్లినావు
తిరువీదులనూరేగుతు దేవేరులతోడా
మమ్మానందింపగ వెలసిన ఆదికేశవుడా!!

గొవర్ధనోధ్ధారి గోపాలా కాళియమర్దన
గొపీజన ప్రియబాంధవ యదునందన
నీ దివ్య మంగళ స్వరూపమునుజూడ శతసహస్రక్షాలు ఏ పాటి
ఓ లోకలోకేశ్వర!! నీకు పదునాలుగు భువనభాండములలొ లేరు సాటి
హరి ఓం నారాయణ పుండరికాక్ష దీనజనబంధొ
వాసుదేవ నరశార్దూల నందనందన భక్తసులభ భవసాగరసేతో

Popular Posts