ఇదో బాధాకరమైన కావ్యం
Image Courtesy: Worth 1000 |
అక్షరాలను పేర్చి ఓ కవితగా మలచాననుకున్న
కాని
ఆ కవితే అక్షరాలై ఉరకలు తీసాయి ఏమిటో ఈ విచిత్రం
మాటలు ఏవో చెప్పాలని ఆత్రుతగా వచ్చాను
కాని
ఆ మాటలు పెదవిని దాటలేదు ఏమిటో ఈ విచిత్రం
మనషులం కదా అందరు కలిసి మెలిసె ఉంటారనుకున్నా
కాని
మనిషి మనిషికి ఇంత వ్యత్యాసా ఏమిటో
కన్నులు దాటి కన్నీరు ఎరయ్యి పారుతూ ఉంది
కాని
నా మనసుకు సాంత్వన ఇచ్చే వారే లేరే ఏమిటో
స్నేహానికి ప్రేమకి ముడి పెట్టి స్నేహాన్ని ప్రేమ అన్న సమాజం
మనిషిలోని మంచితనాన్ని ఒర్వకుండా కుళ్ళుకుంటారు ఎందుకనో ?
స్థితిగతుల పుణ్యమా ఇది మంచితనం చేసుకున్న పాపమా ?
చెప్పే మాటలు తూటాల్ల గుండెను గాయ పరుస్తున్న
నిలబడి పోరాడాలని మనసు అనుకున్న నిలవనేలా ?
చెప్పే ధైర్యం లేక ఎవరో అనామకుడు బాణాలు సంధిస్తే
అది గురి తప్పి నన్నే వెంబడి శూలంలా వెంటాడితే ఎలా ?