నీ ప్రేమలో
Image Courtesy: John DeBoer (Picasa) |
వేకువే తెలియని రోజుని రేయని పిలవాలా
లేకా వేకువే లేదని చీకటిలో మిగిలిపోవాలా
గుండె ప్రతి చప్పుడు నిన్నే తలిస్తే నాలోని నేనే నీదరికి పరుగు పరుగున రానా
వెన్నెల్లో చల్లని మంచుతెరలా వచ్చి నీ కన్నుల్లో కలనయ్యి వాలిపోనా
చీకటి దారిలో వెలుగు కోసం వెతుక్కుంటూ నిన్ను చేరుకున్నాను వడివడిగా కదిలి
నా జీవితమ్ లో వెలుగులు నింపి నువ్వు వెళ్ళిపోయావు నీ తలపులను నా యదలో వదిలి
వాసంతం పూయించావు నా యదలో
తెలియని లోకం చూపించావు నీ ప్రేమలో