ఏదో రాయాలనిపించి...
ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000. కామ్ |
మనసు ఆనంద డోలికలు ఊగుతూ ఉంటె
తనతో పాటు ఏదో అందాల లోకం లో విహరింపజేస్తుంటే
అక్షరాలన్నీ భావాల సుడిగుండంలో చిక్కి చెల్లాచెదురైపొయాయి
ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను
ఏవో తియ్యని జ్ఞాపకాలు కళ్ళముందు కదులుతుంటే
ఆ తెరచాటు భావాలేవో బయిటికి ఉబికివస్తుంటే
అక్షరాల్లని ఆ ఊబిలో చిక్కుకుని సుడులు తిరిగి కనుమరుగయ్యాయి
ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను
ఎన్నోరోజులుగా అనుకుంటున్నా ఆ ఆత్మీయ స్పర్శ ఏదో నన్ను తాకింది
ఎవరని వెనక తిరిగి చూసా భయం తో, అక్కడ ఎవరు లేరు నా నీడ తప్ప
ఆ నీడలో నా నిన్నని చూసి బాధతో నీరుగారి ఎండిపోయాయి
ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను
మదిలో భావాలను ఎకరూపు పెట్టాను
తన పంతం నేగ్గించుకుని ఠీవిగా నిటారుగా నిలబడిన ప్రేమ నన్ను అర్హత అడిగింది
ఇన్నేళ్ళు నిన్ను నేను నా మదిలోనే దాచిన సంగతి చెప్పాను
మనసుని అర్ధం చేసుకోలేని ఫీలింగ్ ను నీకు పరిచయం చేసింది నేనేనా అని తలవాల్చి అదృశ్యమయింది
ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను
భావాల కొలను లో చెదవేసి ప్రేమను తోడాలని ప్రయత్నించాను
సగం దూరం దాక లాగిన తరువాత బరువెక్కిన గుండె బావురుమంది
చెదకు చెదలు పట్టి సగం లోనే ఆ తాడు తెగి తిరిగి ఆ హృదయ-కొప్పెర కొలనులో మునిగింది
నీ జ్ఞాపకాలను చెరపడం అంత సులువు కాదని అర్ధం అయ్యే సరికి తెలవారిపోయింది