హే మాధవ ముకుందా
మృదు అందేల రవళి పిల్లనగ్రోవి చేతబూని రారా ఓ గోపివల్లభా
నిశ్చల గీతగోవింద నారాయణ పాహి ముకుందా మురారి
వెన్నెల అందియల చిరు సవ్వడితో వెన్నలు హరింప రావేల
కాలియా మర్దన గోవర్దన గిరిధారి గోపాలబాల బృందావిహారి
సిఖిపించము కిరిటాలన్కృత రాధ మనోహర మృదుపాణి
వందే జగన్నాధ శ్రీ ముకుంద మాధవ శేషశయన శోభితకరి
నీ ముద్దు మాటలు పలుక, ఉట్టిని కొల్లగొట్టగా రారా ఓ గీతాచారి
కవితాలోల హృదయ డోలికా పురోగమన తిరోగమన సంచారి
కృష్ణాష్టమి నేడది జరిపేద పూజలందుకొని మమ్ము కాచు ఓ నరహరి