ఒకే ఒక్క క్షణం
ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000. కాం |
ఒకే ఒక్క క్షణం చాలు అదే ప్రేమని బుగ్గిపాలు చేసుకోవడానికి
ఒకే ఒక్క క్షణం చాలు ఒప్పును తప్పు అనుకోవడానికి
ఒకే ఒక్క క్షణం చాలు మంచిని చెడు అనుకోవడానికి
కాని...
ప్రేమను వ్యక్తపరచడానికి ఒక్క క్షణం సరిపోదు
ప్రేమను ఆస్వాదించడానికి ఒక్క క్షణం సరిపోదు
ప్రేమను అర్ధం చేసుకోవడానికి ఒక్క క్షణం సరిపోదు
ప్రేమను ప్రేమించడానికి ఒక్క క్షణం సరిపోదు
ప్రేమపు కాంతిని కనుమరుగు చెయ్యాలంటే ఒక్క క్షణం సరిపోదు
దానికి....
అలుపెరుగని ప్రేమను పంచె హృదయం కావాలి
అలుపన్నది లేని ప్రేమించే గుణం కావాలి
మనోభావాలు అర్ధం చేసుకునే ఆర్ద్రత నిండిన కన్నులు కావాలి
గాలిపటానికి తాడు లాగ ప్రేమకు ఆలంబన కావాలి