అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే...

చుక్కలను దాటి దిక్కులను దాటి
ఈ అండపిండ బ్రహ్మాండ మూలాలను
ఆనాడేప్పుడో శ్రీ కృష్ణ పరమాత్మ యశోదమ్మ కు చూపెనటా

రోదసిలో మానవుని ఉనికి నిజానికి ఎల్లలులేనిది
జాబిల్లి వెన్నెలలు పున్నమి మల్లెలు
ఝాము నది ఝాములు జీవనదులు

జీవకోటి తనలో మమేకం చేసుకుని
ఏమి తెలియని సుక్ష్మ రూపం లో సంచరించ వచ్చాడట
పది వేల ఆత్మా జ్యోతిర్లింగాల సమానంగా ఈ 'పాల పుంతలో'
క్షీర సాగరం వెలసి వైకుంఠ నారాయణుడు చెప్పిన ఓ సూక్ష్మ సత్యం ఇది

జీవకోటినేల్ల అన్వేషణ మార్గం శోదింప తలపెట్టిన సృష్టి రహస్యం
అందుకే ఆ నాడు గోపబాలుడు మన్ను తినేన్ యశోదమ్మ అనగా
సృష్టి నంతటిని తన నోటిలో ప్రదర్శించి జన్మను తరింప చేసినట్టు
మానవునిగా .. ఆ స్వామీ భక్తునిగా... గూగుల్ ప్లస్ సౌజన్యం తో నేడిలా
మీకు మరలా అలాంటి దృశ్యాన్ని మీ ముందుకు తేవాలని పడిన ఆరాటం ఆత్రం ఇది

చూసి తరించండి .. నేడీ రోదసిని అన్వేషించ పూనుకున్న 'ఇస్రో ', 'నాసా', 'హబ్బుల్ స్పేస్ టెలీస్కోప్' లకు అంకితం ఇస్తూ .. శ్రీ కృష్ణ పరమాత్ముని అంశాలైన మన మీద ఆ స్వామీ కృప కటాక్షం ఎల్లవేళలా ఉండాలని
ఆ పాంచజన్య ప్రియుడిని మరొక్కమారు హరికీర్తనం గావించి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను

"గోవింద బోలో హరి గోపాల బోలో "
"రాధ రమణ హరి భూపాల బోలో "
ఇమేజ్ కర్టసీ: గూగుల్ ప్లస్ 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల