శ్రీమన్నారాయణ పదకమలార్చన

Image Courtesy: Google
రాగం: భూపాలరాగం
తాళం: ఆదీతాళం

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ పాదమే శరణు

కమలసతీ ముఖకమల, కమలహిత కమలప్రియ కమలెక్షణ
కమలాసన హిత, గరుడగమన శ్రీ కమలనాభ, నీ పదకమలమే శరణు

పరమయోగి జనభాగ్యదేయ శ్రీ పరమపురుషా,
పరాత్పర పరమాత్మ పరమాణురూప శ్రీతిరువేంకటగిరి దేవా శరణు

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి రచన సౌరభం 

Popular Posts