ఆశావాహ దృక్పథం

Image Courtesy: Howard Witzel (Picasa)
మోడువారి  కాండం ఒక్కటే మిగిలిన ఈ చెట్టును చూస్తె మీకేమనిపిస్తుంది ?

నిన్నటిదాకా పక్షుల కిలకిల రావాలతో మారుమ్రోగిన ఈ ప్రాంతం కానవస్తుందా ?

పచ్చని పల్లవులతో నిత్యం శోభాయమానమైన విశాలమైన చెట్టు ఆనవాలు కానవస్తుందా ?
ఆ చిటారు కొమ్మపై నిన్నటి వరకు పిక మయురాలు నిలిచి ఆడి పాడిన గురుతులు కానవస్తుందా ?
నిన్నటిదాకా పశువులు ఈ చెట్టు నీడలో హాయిగా సేద తీరిన చల్లని క్షణాలు కానవస్తుందా ?

నింగికెగసి మబ్బులతో మాటలాడిన ఆ ఊసులు, ఊసులు విన్న మబ్బు కరిగి చినుకై రాలి జీవం ఉట్టిపడు ఈ చెట్టును చూసి మనసున్న ఎవరు దీనిని మోడువారిందనుకోరు. 


మనిషికూడా తనకు కలిగే బాధ, నిట్టుర్పు , ఆవేదన ఛాయలు విడనాడి, బాధను కూడా దిగమింగి ఆశతత్వాన్ని పుణికి పుచ్చుకుంటే ఎప్పుడు మనిషిని కృంగిపోడు.

Image Courtesy: Zatnaktel Cz (Picasa)
కళకళ లాడుతూ గాలికి అభివందనం చేసే ఈ చెట్లను చూస్తె మీకేమనిపిస్తుంది ?

యవ్వనం తిరిగిరానిదని ఆ నీడలో మంచికి  ముందడుగు వెయ్యాలని పిలిచే ఆ భావం కానవస్తుందా ?
రివ్వున ఎగిరే పక్షుల సమూహం ఈ పచ్చని చెట్లతో మాటలాడిన ఊసుల తాలూకు గురుతులు కానవస్తుందా ?
పచ్చగా ఒక్కో ఆకు గాలికి ఓలలాడుతూ సంతోషం వేల్లబుచుతున్న సంకేతాలు కానవస్తుందా ?
ఆ సూర్యరశ్మి కి పచ్చ రత్నం లా మెరుస్తున్న ఆ చెట్టు కొసలు కానవస్తుందా ?

నింగిని తాకాలని ఎగబాకే ఆ చెట్టు కొమ్మల నిగారింపులో దాగిన హరివిల్లు ఒకటి ఆ ఆకాశవీధిలో తరాస పడుతూ ఈ పచ్చని  ముచ్చటలాడుతున్న అపురూప సన్నివేశం ఒకటి కళ్ళకుకట్టినట్టు కనిపిస్తుందా ?

పరిస్థితుల ప్రభావం మనిషిని సంతోషాల వైపునకు నెట్టిన లేక విశాదాల వైపునకు నెట్టిన, ఆశావాహ దృక్పథం అలవర్చుకుంటే ఎప్పుడు మనిషే విజేత.. ఇదే ప్రకృతి తల్లి మనకు నేర్పిన ఓ మరుపురాని పాఠం 

Popular Posts