ఘర్షణ-సంఘర్షణ

కన్నులకు  దాచడం తెలియదు ,
 అందుకే కలల రూపం లో నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది

మనసుకు మాట్లాడడం రాదు,
అందుకే మూగాభాషను తనకు దగ్గరైన వాళ్ళ మనసులో చేరవేస్తుంది

హృదయానికి దేనికెలా స్పందించాలో తెలిదు,
బాధ ఐన సంతోషమైన అతిగా కాని అల్పంగా కాని కొట్టుకుంటది

కన్నుల్లో కలల కొలనులో ప్రతిబింబించే ప్రతి బింబం మనం ఇంతకూ మునుపు చూసినదే
వెన్నెల గీతికలు మనం ఇంతకూ మునుపు విన్నవే ఐన ఎందులకో ప్రతి సారి ఏదో కొత్త రాగం పలికినట్టు మనసు ఎటు తెల్చకా సతమతమవుతుంది ఎటు వేళ్ళలో దారి తెలియక, తెలిసిన దారి ఐన మనసు ఒప్పక, మనసు ఒప్పిన ప్రాణం ఒప్పక ఇలా ఒక్కో అవయవం ఒక్కోసారి నిరాకరణ కు గురవుతూనే ఉన్నాయి, లోకం ఇలా సాగిపోతూనే ఉంది   

Popular Posts