మానవాళికి ఒక సందేశం
Image Courtesy: Agreeing Tumbler |
స్వచ్చమైన జలపాతాలు సెలయేరులు నదులు మనకు కానుకగా ఇచ్చింది.. మనం మన స్వప్రయోజనాలకై ఆ నీటిని కలుషితం చేస్తున్నాము. ఇది ఎంత వరకు సబబో మనిషిగా పుట్టిన మనకే తెలియాలి
ఊపిరి లేని వస్తువేది ఉనికే లేని వస్తువని తెలిసి, నిర్మలమైన వాయువుని, పొగాకు వాయువుతో, నిత్యం రద్దిలై మెదిలే రాజమార్గంలో ధుమశకటాలతో అనునిత్యం కాలుష్యానికి కాలు దువ్వుతున్నాడు
బ్రతికున్నన్నాళ్ళు మన కోసమే బ్రతికితే స్వార్థపరులం అంటారే, కాని భావి తరాలు కాలుష్య భూతం విషపు కోరల్లో చిక్కుకుని అలమటిస్తూ ఉంటె నువ్వు తలపెట్టిన కాలుష్య భూతమే వారినావహిస్తే చేసేదేమిలేక తలపట్టుకుంటావా
ప్రకృతి వోడిన పుట్టిన మనిషి ప్రకృతి తల్లి అచ్చాదనాన్ని వేరులతో పెకిలించి వెకిలిగా నవ్వుతు 'కాంక్రీట్ జంగల్' ఏర్పచుకుంటుంటే, నిలువు నీడ లేని క్రూర మృగాలు చేరి మనషుల మీద దాడిచేస్తే బాధ్యులు ఎవరు?
ప్రకృతి తల్లి మనకు పంచభూతాలను సరి సమానంగా పంచి ఇచ్చింది, అది అందరిది.. మనం ఉన్న లేకున్నా ఆ ప్రకృతి తల్లిని కాపాడుకోవడం మనుషులుగా మన అందరి బాధ్యత. ఎకిభావిస్తారా తిరస్కరిస్తారా ??
/* రోజు రోజుకి పెరిగిపోతున్న భూతాపానికి, కాలుష్య కోరల్లో చిక్కి అతలాకుతలమవ్వుతున్న మానవాళి కి హెచ్చరిస్తూ వ్రాసిన చిరు గేయం ఇది. ఇందులో ఎలాటి తప్పొప్పులు ఉన్నా, భాష సరిగ్గా లేకున్నా, ఏ పదమైన తప్పుగా ఉన్నట్టు అనిపించినా పెద్ద మనసుతో క్షమిస్తారని ఆసిస్తూ */