నా గుండె ఏనాడో పగిలింది

ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000

నా గుండె ఏనాడో పగిలింది 
అందులోని నా ప్రేమ ఇంకా పారుతూనే ఉంది 

నా గుండె ఏనాడో పగిలింది 
అతికించినా అతకనంతగా ముక్కలు ముక్కలుగా 

నా గుండె ఏనాడో పగిలింది 
బహుశా నీ గుండె చప్పుడు విని బ్రతికున్ననేమో అనిపిస్తుంది 

నా గుండె ఏనాడో పగిలింది 
పగిలిన ముక్కల్ని ఏరుతున్నాను , అన్ని ముక్కల్లో నీ జ్ఞాపకాల వీచికలే 

నా గుండె ఏనాడో పగిలింది 
సైబోర్గ్ గుండెలో భావాలు ఎన్ని నింపినా స్పందన లేకుంది

నా గుండె ఏనాడో పగిలింది
కన్నీటి సంద్రమే నా కళ్ళముందు కదలాడింది

నా గుండె ఏనాడో పగిలింది 
స్వచ్చమైన నీ ప్రేమ పొందలేక విలవిల్లాడిపోయింది 

నా గుండె ఏనాడో పగిలింది 
వెన్నెల రేయి కూడా ఎర్రని ఎండగా మారిపోయింది 

నా గుండె ఏనాడో పగిలింది  
ఓ రోజా మొక్క అందునుండి ప్రాణం పోసుకుంది 

బహుశా అదే మన ప్రేమపు చివరి చిహ్నమో ఏమో

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం