కదలాడే ఊసూలు

ఇమేజ్ కర్టసీ: గూగుల్ ప్లే (పికాస)

కన్నుల్లో కాంతి నింపే వేకువై నిన్ను చేరుకోనా
కనుపాపలో కొలువై ఓ కలలా నిన్ను చేరుకోనా

తుళ్ళి పడే తుంటరి భావాన్నై నీ మదిలో నిలిచిపోనా
నీ అందేలా మాటు సుస్వర సంగీత మువ్వల రవళినై ఝల్లు ఝాల్లునా రానా

నీ అధరాలపై చెరిగిపోని చిరునవ్వునై ఒదిగి పోనా
వెన్నెల్లో జలకాలాడే తార తోరణమై పున్నమి రేయినై పోనా

తామరాకు పై నీటి బొట్టులా నీ స్వచ్చమైన ప్రేమలో మునిగి తేలనా
కలవరింతల తలపు లో వలపు పల్లకి ఎక్కి నీ యదను చేరుకోనా

నీ మృదుమధుర లాస్య లావణ్య లాలిమలా మారి నీ అందాన్ని రెట్టింపు చేయనా
మారుపే రాని అలుపె లేని నీ మాటల హోరులో హాయిగా తేలిపోనా

నా యదలో నీకోసమని గుడి కట్టి నీరాకకై  వేచి చూడనా
సూర్యోదయం లోని లాలిమను నీ నుదుటిపై కుంకుమనై వెలిగిపోనా  

Popular Posts