Posts

నిఖార్సైన నిజం

ఈ కాలం లోను ఏ కాలం లోను కల్తి లేనిది అమ్మ ఆప్యాయత.. కల్మషమెరుగనిది నాన్న దీవెన.. సాటిలేనిది స్నేహానుబంధం.. విశ్వసనీయత విధేయత నమ్మకం నిరాడంబరం మచ్చలేని గుణాలు..

ప్రతి ఘడియ కదిలేను త్రివేణి సంగమమై

జీవితం కాలమనె తెరచాప తో సాగే పయనం గతుకుల అతుకులతో పడుతు లేచే కెరటం ఆడంబరాల అదుపుతో కుదుపు లేకా సాగే ఝరి కపటమనే భావన దరిచేరని జీవితానికి సరాసరి మనిషి మనిషికి నడుమ కానరాని తెర అహంభావం నిత్యం సతమతమయ్యేను తనకదే కదా అనుభవం కాలికి గాయం ఐతే ఓర్చుకోవచ్చు మనసుకి గాయం ఐతే ఏడుపే వచ్చు మంచి అనే భావన ప్రతి ఒకరిలో వెలిగే దీపం చమురు మాత్రం ఒక్కో దీపానికి భిన్నం సహేతుక పలకరింపులన్ని అజ్యపు దీపాలే మసిబారని మనసుకు దర్పణాలే స్వార్థమనేవి కర్పుర హారతులే దిస్టి తీసి కన్నులకు హత్తుకోగా నల్లగా చేతికి మసి అగాధాల మాటునా రగిలే నిప్పు ఎరుగని కొలిమిలివే మనస వచస కర్మణ త్రికరణశుద్ధిగా ఆచరించే జీవితపు సోపానాలివే అచేతనంగా అనాలోచితంగా అప్రయత్నంగా అగమ్యగోచరమై కాలమే సమాధాన పర్చగా ప్రతి ఘడియ కదిలేను త్రివేణి సంగమమై

పదాల లోగిలి

మనసుకి మారుమాట మెదలక మారిపోయే మరునిమిషానా మాటలే మూగబోయి మౌనముగా మారేనేమో.. నవ్వులన్ని నిలువరిస్తు నవ్యతను నిదర్శిస్తు నగుమోమున నవకాంతులు నెలకున్న నిమిషానా వసంతమున విరితోటలో విహరిస్తే వర్ణాల విహారి..విరవిగా విరబూస్తాయి వేవేల వర్ణాల విరులు..

సుస్వర సుమధుర కావ్య గుళిక..!

నా మనసు ఆహ్లాదంగా ఉన్నా, అల్లకల్లోలంగా ఉన్నా వస్తాయి కవితలు ఓక్కోసారి లుతవిక కూడాను. కవిత: కనులకే వినిపించే తతంగం.. తవిక: తనువు వికసించే కవనరాగం.. కనబడదు భావం.. వినపడదు మాట.. తపన మాత్రం కవిత.. ప్రేరణాత్మక మహిమాన్వితమగునేమో కదిలే కాలానికి సాక్షిగా.. పదాల కూర్పులో జ్ఞాపకాల వీచిక.. సుస్వర సుమధుర కావ్య గుళిక..!

సాగే జీవన పయనం

కలత నిదురలో కనురెప్పల అలికిడులు వింటు కరగని నిశిధిలో కాంతి కిరణమై వెలుగు ప్రసరిస్తు కవిత పదాలలో ఓనమాలలో దాగిన భావమై నిలుస్తు గాలివానను తనలో దాచిన ప్రకృతిలా మారిపోతు కాలానికి కలానికి ఎదురు నిలుస్తు ఒక్కొక్క బంధాన్ని కలువుకుంటు సెలయేటి జలపాతంగా నిలుస్తు కరిగే కన్నీటి వెనక లోకాన్ని చూపించే కాంతినవుతు నిలువున కాలుతునైనా పదుగురికి వెలుగు చూపుతు దివికి భువికి వారధిలా మానవత్వాన్ని చాటుతు కలకాలమిలా ప్రకృతిలో లీనమవుతు... సాగే జీవిత పయనం..

కరిగి కన్నీటి చిరుజల్లాయేనా

కన్నుల అంచుల్లో కన్నీటి ధారా కనులకు చలువ అందించేనా మనసులోని బాధను కడిగేనా కనువీడిన చిరు చెమ్మ చెంపకు జారేనా చిరునవ్వులే కానరాకా కనుమరుగాయేనా

మొదలు తుదలు

మచ్చలేని చంద్రుడిని చూడగలరా ఎవరైనను నీలాకాశం పడిందేమో అవాకు చివాకు పరాకు పెనుగాలి హోరులో వాన చినుకులో చిందులు తుళ్ళి కుకుకు అంటు కోయిల రాగం మరల వినిపించింది రింగు రింగులుగా తిరిగే రంగులరాట్నం కానవచ్చిందా?