ఏమని వర్ణింతును ఈ ముదావహ ఘట్టాన్ని పలుకులన్ని పదాలయ్యి కవితగా ఇమిడే క్షణం అత్యద్భుతమే కదా ఇక ప్రతి ఘడియ నీతో ఓ రతనాల బొమ్మ నిను చేతబట్టి నా కాబోయే భార్య కు అంకితమిస్తు
కనురెప్పల లోగిలిలో కనుపాపలో ప్రతిబింబించే రూపం తాను తళుకులీను తారకల నడుమ నిండు పున్నమి జాబిలి తాను వర్ణనకే వర్ణాలు పరిపూర్ణం కాని అపురూపమైన బంధం తాను అనిత.. అనిర్వచనీయమైన నిబద్దతగల తపఃఫలం నీవు నీ రాకతో మధువనమే కదా ఇక నిండు నూరేళ్ళు
మంచి మాట "నీ సోంత మనిషిని సైతం నీ అహంకారం కోసం నీకు నువ్వుగా వారిని దుర్భాషలాడుతు సంతోషం పొందుతున్నా కూడా ఎదుటివారు నిన్ను నిన్నుగా ఆదరిస్తే అపుడు ఓడింది ఆదరణకు కూడా నోచుకోని వారిని సైతం ఆదరించే నీ సొంత మనిషా లేకా నీలో నీకు తెలియని అహంకారమా.." "ఎదుటివారి మనసుని ఆహ్లాద పరచటం రాకపోతే పరవాలేదు.. కనీసం వారి మనసుని బాధ పెట్టకుంటే అదే శ్రీరామరక్షకవచం" మంచి మాట మేఘం కరిగేది తనను తాను తగ్గించుకునేది కేవలం చినుకుగా రాలి నేలను సస్య శ్యామలం చేయటానికే
కాలం ఎంత విచిత్రమో ప్రతి క్షణం మనతోనే ఉంటూనే గడిచిన క్షణాన్ని జ్ఞాపకంగా మార్చేస్తుంది కాలం ఎంత విచిత్రమో ప్రతి క్షణం ఉద్వేగంగా ఉంటూనే నిన్నటి దుఃఖాన్ని సైతం మాయం చేస్తుంది