Posts

~

జీవితం చూట్టు ఆశలు అడియాశలు భావోద్వేగాల నడుమ రాగద్వేశాలు సిర ధమనుల ను దాచే కండర యముకలు శిథిలమైన అవయవాలకు పెళుసుబారే అస్తిపంజరాలు ఒకరికొకరై కడదాక మెదిలితే నవరసాలు కోపోద్రిక్తత కనుమరుగున పడితే అన్యోన్యతలు అపుడుపుడు నమ్మినా నష్టమే అడపదడప కావలసినా కష్టమే పేగు బంధానికి విలువ కాటిలో కట్టే కాలే ఘడియ దాక వేగు చుక్క తళుకు విలువ నిశీధిన మెఱిసే దాక ఆర్థోపెడిషియన్ మొదలు జెనెరల్ సర్జన్ దాక చమురు కొండెక్కక మునుపే దీపాన్ని కాపాడే కరములు తెలిసి తెలియక నడిచే దారిలో అపుడపుడు రాళ్ళు రప్పలు కాని పాదం ధూళి తాకితే రాయైనా ముక్కలగును ముళ్ళు సైతం పూలగును కాలమే సాక్షి కాలానికే కష్టాన్ని పరిచయం చేయటం తెలుసు మరల ఆ కాలక్రమంలో నష్టాన్ని నివారించటం తెలుసు ఏదేమైన ఈ ఊపిరి లయగతుల లోలకడోలక మనసు మందిరాన భావాలకు కొదవ లేదు.

ಕೆರಟಂ

కడలి పాతదే కెరటం కొత్త ఒరవడి ఆకాశం పాతదే మేఘాలు కొత్త ఒరవడి ఊహలు పాతవే ఆలోచనలు కొత్త ఒరవడి పాత కొత్తలో వ్యత్యాసం కేవలం కాలగమన మార్పు నిన్నటి పాతలో రేపటి కొత్తదనానికై నేటి సంఘర్షణ

Travel Woes

Sometimes, A Joyful Journey becomes a Grisly Grumpy Trip, all that makes it so, is dependent on who you are travelling with and who else is travelling with you, which can affect your mood and reflect your emotion outburst. 《20806》 09.02.2020

ఉనికి

కలలనేవి కనుల కొలనులో మానసిక ప్రతిబింబాలు ఆలోచనలనేవి మేధోమధన ప్రక్రియ ఈ రెంటికి మిన్ను మన్ను కు ఉన్నంత తేడ ఉంటుంది.. ఆ రెంటి నడుమ భావోద్వేగాల రాగద్వేషాల ప్రేమానురాగలను కలగలసిన ఉచ్వాస నిఃశ్వాసలో వెతుక్కోవాలి మనిషి యొక్క ఉనికి.

పాలు పెరుగు నేయి ఈ బంధం అమోఘం

భార్య భర్తల బంధం పాలు నీళ్ళలా కలిసి మెలసి ఉండాలి అలా ఐతే ఇద్దరి ఆంతర్యాలకు వ్యత్యాసాలు దొరకవు.. పాలు తోడుగా ఉంటే ఉనికి కాస్త పులిసి పెరుగులా మొత్తం పాలనే మార్చేస్తుంది.. ఐతే కాసిన్ని నీళ్ళతో మజ్జిగ చిలికి వెన్నలా ఆ బంధానికే వన్నె చేకురుతుంది.. కాచిన నేయిలా కలకాలం ఆ బంధం గుభాళిస్తుంది..! #ధరణి

Point of View

It is how you perceive from your point of view that matters, for some, the tracks converge, for some they diverge, and for some others, they are fixed to the fish plate. It is not the branching or rooting, it is the perseverance that matters most.

అయోమయ నివృత్తి

రెప్పల నడుమ లోకాన్నే ఇమడ్చగల కన్నుల్లో అపుడపుడు చెమరింతల చిరుజల్లు.. కోప తాపాల అశనిపాత ఘాతాన్ని అణిగిమణిగి అణచాలి.. మనసు వ్యాకులత.. మనిషిలో సందిగ్ధత.. అపురూప భావాలన్ని అయోమయ ఆలోచనలతో గందరగోళాన్ని సృష్టిస్తున్నా గాని మంచితనపు మార్గమెపుడు స్వాగతం పలుకుతూనే ఉంటుంది..