Posts

విధీ

 విధి ఎంతో విచిత్రం తెలిసి తెలియని వింత నాటకం క్షణ కాలం ఉబలాటం మరు నిమిషం నిర్వేదం అల్లుకుపోయే బంధాలు కొన్ని చెంతకు చేరిన చేరువ కానివి కొన్ని రాగద్వేశాల భావోద్వేగాల జీవితం చూసి చూడని ఘటనల సమాహారం ఎనలేని మమకారాల తేనెపట్టు కొన్ని బంధాలు మనిషికి మనిషికి నడుమ మరికొన్ని బంధాలు మనసుకి మనసుకి నడుమ కొందరి జివితాలు తెరిచిన పుస్తకాలు మరి కొందరివి మండుతున్న ఆశల అగాధాలు కొందరు జీవితాన్ని వెక్కిరిస్తారు మరికొందరు అదే జీవితాన్ని ఔపోసన పడ్తారు కాలగమనంలో అందరి పయనం (అటే) అయినా ఏలా ఇలా దాపరికాలు.. మమతానురాగాల మాటు రేగే వింత ప్రశ్నలు కొన్ని బంధాల నిడివి కొద్ది కాలమైనా వాటి విలువ జీవితకాలం గుర్తుండిపోతాయి ప్రకృతిలో శిలాక్షరాలై మిగిలిపోతాయి మరికొన్ని ఇసుక తిన్నెలుగా మారి సంద్రపు అలల నురగలై ఉవ్వెత్తున ఎగసి మరలి వెళ్ళిపోతాయి జీవితమనే పుస్తకమే మనది, అందులో కోపతాపాలు బంధాలు బాంధవ్యాలు ప్రేమలు ఆప్యాయతనురాగాభిమానాలు కష్టసుఖాలు కలబోసిన ఓ కమ్మని కావ్యమాలిక

భార్య భర్తల అనురాగాత్మీయ బంధం

  భార్య గౌరవం తన భర్త అడుగు జాడల్లోనే ఉంటుంది. వైవాహిక బంధం తో ముడి వేసుకున్న ఆడ పిల్ల పుట్టినింటి పరువు ను మెట్టినింటి మర్యాద ను భర్తకు తోడుగా భర్తయే నీడగా తలచి కాపాడు కోవాలి. సీతమ్మ తల్లి రాముని వెంట అడవులకు సైతం పయనమయ్యి సాధ్వి అనిపించుకున్నారు.. కనుకనే నేటికి ఆదర్శ దంపతులు సీతరాముల వారే..! ~శ్రీత ధరణి

SpEcIaL eFfEcT

 కు..తో..వం.. ఎ..పి.. వా.. ఆ.. ఊ.. పె.. కు.. హ.. కలత చెందిన మనసు వేదన నిండిన హృదయం

అక్షువులు

 అపురూప దృష్యాలను అలవోకగా బంధిస్తు.. వాటిని జ్ఞాపకాలుగా మలచి.. నింగి నేల నడుమ నిచ్చెనలా.. నిన్న కి నేటికి నడుమ వారధిలా.. కవల కలువ కుసుమాలుగా ముఖారవిందంపై కలలకి వాస్తవాలకి చిరు చెమ్మకి భాష్ప తుషారానికి ఆనవాలు * అక్షువులు *

కాలం

నే పుట్టి మూడున్నర దశాబ్దాల నాటి నుండి ఏనాడైనా అనుకున్నానా ప్రాచిన సాంప్రదాయమైన మన నమస్కారం ఇలా షేక్ హ్యాండ్ దాక వచ్చిన టెక్నాలజిని దాటి మరల నమస్కారం యావత్ ప్రపంచానికే సోకిన కరోనా ను కాస్తో కూస్తో కట్టడి చేసే సాధనమై నిలుస్తుందని.. ఈ మూడు పదుల  ఐదు ఒకట్ల వయసులో సైతం ఒకరితో ఒకరికి ఉత్తరం నుండి వృద్ధి చెంది ల్యాండ్ లైన్ దాటుకుని సెల్ల్యూలర్ మొబైల్ ను మించి డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ తో విడియో కాన్ఫరెన్స్ ఐతేనే ఈ కోవిడ్ కాలమున సరైన ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు ఉంటుందని. ఈ ముప్పది ఐదు ఎండ్ల నాటి సంధి ఏ మారు మూలాన సైతం కిక్కిరిసిన జనం గగ్గోలు వింటు.. ట్యాక్సి, బస్ ట్రేయిన్, ఏయిరోప్లేన్ లలో నిత్యం సందడి కాస్త అటు ఇటుగా ఇరవై ముప్పై మించ కూడని ప్రయాణాలకు దారి తీస్తుందని గడచిన ముప్పై ఐదేళ్ళలో దగ్గు కి బెనాడ్రిల్ సిరప్ లేదా అజిత్రాల్ ౨౫౦ ట్యాబ్లెట్లు, జలుబు కు సెట్రిజైన్ హైడ్రోక్లోరైడ్, జ్వరానికి వోవెరిన్, పెరసెటమాల్ మాతరలు వేసుకుంటే ఇట్టే నయమయ్యే షరామామూలు కాస్త పెచ్చుమీరి అలాటి లక్షణాలనే పోలి ఇలా ఇలాఖాలలో వణుకు పుట్టించేదిగా పరిణితి చెంది మ్యాస్క్ లను సైతం బట్టలలో భాగం చేసేటంతగా భయభ్రాంతులకు గురి...

నా చిట్టి తల్లి

నీ ముద్దు మాటలతో ఆనందరాగాల డోలికలే వీనుల విందవగా నీ పాదముద్ర నా యదపై తడబడుతు సాగువేళ చక్కగా నీ చిరునవ్వులోలుకు మోవిపై పసిప్రాయం భాసిల్లగా నా చిట్టి తల్లి నీకు జన్మంత వాత్సల్యతను పంచుతు ఋణపడి ఉండనా ఆము అంటు నీ మునివేళ్ళను నువ్వే నోటికి చేర్చుతు సైగ చేసే వేళ గోరు ముద్దలు కలిపి కొసరి తినిపిస్తు నీ కడుపు చల్లగాయని దీవించనా ఖా అంటు దీర్ఘంగా గంభిరంగా నీవు చెబుతుంటే జెమ్స్ తెచ్చి ఒక్కోటి చొప్పున రోజు నీకు కానుకీయనా తాతా అంటు గారాలుపోతు తాతయ్య దగ్గర మురిపించినా నానమ్మ ను మామా అంటు పలకరిస్తూనే ఓయంటు నానమ్మే పలకగా వెంటనే ఏయ్ అంటు ముసిముసి నవ్వులు చిందించటం శానిటైజర్ చేతిలో వెయ్యమంఠు నా దగ్గరకొచ్చి తలాడిస్తు నీ చిన్నారి పిడికిలిను అలవోకగా విప్పదీసినా.. ఆటలాడుతు అమ్మను సైతం నీ ఆటబొమ్మగా మలుచుకుని జుట్టంత లాగేసే అల్లరి పిల్లవంటు ఫిరియాదులను ముద్దులతో అందరం ఏకధాటిగా ఆశిస్సులను అందిస్తూ నా ఎడమ చేతి బొట్టన వేలు ఎలా ఆడుతుందో గమనిస్తూ నీ ఎడమచేతి బొట్టన వేలినలా తిప్పటం అది నీకే సాటి ఓ గారాల పట్టి మా ఇంట తిరగాడే శ్రీ కనక కవచ ధారిణి దుర్గాంబిక అంశవై నిండు నూరేళ్ళు సౌఖ్యంగా సఖ్యతగా ధనధాన్యాదులతో తూలతూగుతు ఆ...

Thoughts and Quotes

One might think how am I able to put forth ample quotes, each of which are unique in nature. It is all due to the way how I perceive things in more than one perspective, and dip them in an optimistic flavour. Sometimes, pathetic circumstances overlap, but then, the outcome ought to be always in a way that is approved by everyone alike. Everything has got its own abilities, limitations and are always unique by their own ways, but then, there must be harmony amongst them. An Eagle and A Baya Weaver: Both are Birds, they can fly, but a Baya Weaver cannot glide, An Eagle cannot weave the Signature Balcony Nest.