Posts

చలనం లేని కాలం చలికాలం

Image
వినీలాకాశానా సుర్యరశ్మి ఏమాయేనో చలి ధాటికి వెచ్చగా పలకరింపులే అందకా గజగజ వణికేను ధరణి మంచు తెరలు గుట్టలపై దట్టమాయేను పచ్చని చెట్లు సైతం చలికి కిమ్మనకా ఊరకుండేను కడర్టకట్కట్ రాగమే వినిపించేను హేమంతమిదోయి కడర్టకట్కట్ కడర్టకట్కట్ శీతాకాలం ఇదీ బాబోయి చక్కిలిగింతలు పెట్టినా నవ్వు కాదు చలిపుట్టే కాలం తుషార నీహారికలా చలనం లేని కాలం చలికాలం

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి పదాల కూర్పులో నా ఎదుట కవితయ్యి నిలిచినాయి  బాధగా వుంటే పదాలే తారు మారయ్యి  నవ్వు తెప్పించాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి కవితలో ప్రతి పదం మేమే అంటూ భావమై నిలిచాయి కొన్ని అచ్చులు కొన్ని హల్లులు కలగలిపి చిందాడాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి పలకలేని భాషను సైతం వాటిలో దాగి వున్నాయి పలకరిస్తే కవితల మాలలో నిగుదితమై పులకించాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి 

ద్వంద్వం

మనసులో భావం మెదిలితే.. కన్నులలో కన్నీరే చేరుతాయి ఆ కన్నీళ్ళలో కొంత ఆనందభాష్పాలు మరికొన్ని నిర్వేదపు చినుకులు మునివేళ్ళ చివర  అక్షరాలే కదులుతాయి ఆ అక్షరాల్లో కొంత పదాలు మరికొన్ని పదాలు దాగి భావమే కనిపించే ఊసులు పెదవంచున నవ్వులే పూస్తాయి ఆ నవ్వుల్లోన కొంత ఆనందం మరికొన్ని సంతోషపు ఆనవాళ్ళు   

చిరు చీకట్లు

Image
  చిరు చీకట్లు కమ్మినా నిశిధినా.. కాంతి పంచే వెలుగు వుంటుంది చినుకులే ధారాపాతముగా కురిసినా.. మదిని తడిమి చల్లబరుస్తుంది దారంతా వాగునే తలపించినా..ఇంద్రధనువు ఆకశానా ప్రస్ఫూటమౌతుంది వెన్నెల వెలుగును చూడు నిశిధి ఎందుకు చీకటిగా ఉంటుందో తెలుస్తుంది చల్లని చినుకులను తడిమి చూడు నీలిమేఘాల మాటునా ఉరుమెందుకో తెలుస్తుంది పారే సెలయేటిని చూడు ఉరుకులు పరుగులతో కొండకొనలు అవలీలగా దాటేస్తుంది నలువైపుల చీకటున్నా చమురు దీపం వెలుగు దేదీప్యమానమై వెలుగుతుంది బీటలువారిన భూమి కూడా చిరు చినుకుతో పులకించి మెత్తబడుతుంది సెలయేటి గలగల సంద్రంలో కూడా అలల ఉదృతిలో ఉరకలేస్తుంది

వేవేల వర్ణాల పూలతోట పచ్చని ప్రకృతి వేసే పూలబాట

కడలి కెరటం లో ఏవేవో భావాలు నిత్యం ఎగసిపడే తరంగాలు ఒడ్డును తాకాలని కొన్ని సాగర గర్భాన మరికొన్ని ఆకాశం లో వేవేల వర్ణాలు వర్ణనకు వర్ణాలే అలికె అక్షర శరాలు నీలాకాశపు వర్ణం గడియకో మార్పు భువిపై మనిషికి వాసంతమే ఇచ్చెను ఓర్పు వేవేల వర్ణాల  పూలతోట పచ్చని ప్రకృతి వేసే పూలబాట   

జీవితానికి ఇదే నిండైన నిర్వచన

కదిలే కన్నుల్లో కలలే లోకమై ఇమిడినట్టు  ప్రతి గుండెలయలో ప్రాణమే ఊయలూగినట్టు   రెప్పల అలికిడిలో అశ్రువు బిందువు బాధకి ఆనందానికి నిఖార్సైన నెలవు  ఆనందరాగమే రవళించే వాసంతం  కోయిల రాగాలే ఆలపించెను కాలం  ఊపిరే ఆయువుకు ఆలంబన  జీవితానికి ఇదే నిండైన నిర్వచన   

భావాలు

కావ్యం కాదు కవనం కాదు అక్షరాలతో అల్లిన భావగీతం ఇది పదాల మాటున దాగిన భావాలకు ప్రతిరూపం ఇది కరిగే మేఘానికి నీటి  బిందువులే పరమావధి నీలాకాశాన వెలిసే రంగుల హరివిల్లె సన్నిధి చిరు చిరు పలుకుల మనసులోని భావం పలుకులై మాటగా వేలిసేను కదా మౌనమే అలంకారమై