నా కవితల సమాహారం




అపరిచితులు మనం ఎవరివొ నువ్వు
ఎందుకొ చిన్ని ఆశ అలజడి భావం
జీవితం నీతో ఏమో తెలియదు ఎమైంది నాకిలా
జ్ఞాపకాల వేదికలొ చిరుమందహాసినివై
చిరుజల్లులతొ చలిమంట రేపావూ
ఎందుకొ ఎమైంది నాకిలా ఎప్పుడు లేని సునామి అల
హంసధ్వని పలికే హృదయాలాపన
బాపూ బొమ్మలా చిరునవ్వులు చిందిస్తావూ
ఎవరివొ నువ్వు విరహతాపం కలిగిస్తావూ

గుండెసవ్వడిలొ ఏదో తెలియని అలజడి
నువ్వు-నేను మనం అవ్వాలన్నా ఆరాటం
ఎందుకొ తెలియని ఉబలాటం గుండెలొ చిరుసవ్వడి
ఎప్పుడు నన్ను ఈ తీయ్యని బాధాలొ ముంచేత్తుతావు
ఎప్పుడు తెలియని స్నేహకావ్యంలా అంకితం చేస్తున్నా నీకే

Popular Posts