స్వాతీ చినుకులు... My Song Composition
వేసవి ఎండల్లోన సాయం సమయంలోన నీ ఊసే విన్నానమ్మ
ఎగిసే అలలోన నా గుండె సవ్వళ్ళ లోన నీ రూపే కన్నానమ్మ
ఈ జన్మనైన మరు జన్మనైన నీ జతే కావాలమ్మ
చ 1:
చినుకులా నా ముంగిట్లో వచ్చావమ్మ
వాగులా నా యెదలో పొంగావమ్మ
నదిగా మారి నా మనసులో
మరుపెరాని బంధాన్ని పెనవేశావమ్మ
స్వాతి..
ప 2:
పారే సెలయేళ్ల లోన తళుకుల చుక్కల్లోన నీ ఆశే కన్నానమ్మ
నింగిని అంచులలోన వెండి మబ్బులపైన నీ అలకే కన్నానమ్మ
నా మదిలోన నా భావంలోన నీ పేరే తలిచానమ్మ
ఈ జన్మనైన మరు జన్మనైన నీ జతే కావాలమ్మ
చ 2:
మెరుపులా నా ఊహలో వచ్చావమ్మ
శ్వాసగా నా గుండె గుడిలో నిలిచావమ్మ
ప్రేమగా మారి యెద వాకిలిలో
చెరిపిన చెరగని ముద్ర వేసావమ్మ
స్వాతి...