Saga of Life
నీలాల కన్నులో కనిపించేది హరివిల్లు రంగులు
కాని ఎందుకో ఎక్కి ఎక్కి ఏడ్చి నప్పుడు ముత్యాలు రాలుతాయి
పండంటి గుండెలో ఎన్నో భావోద్వేగాలు
కాని ఎందుకో ఎక్కి ఎక్కి ఏడ్చి నప్పుడు కలతలు
ఏడవడం ఎందుకో జీవితం లో నవ్వు కరువైనప్పుడు
అప్పుగా నవ్వుల వడ్డి పెంచండి కన్నీటి చుక్కలు కాదు
కన్నిళ్ళు బాధ గా ఉన్నా వస్తాయి ఉల్లాసంగా ఉన్నా వస్తాయి
కాని జీవితం మరలి రాదు ఉన్నా ఈ చిన్ని జీవితాన్ని ఆస్వాదించండి
నవ్వుని ఆనందాన్ని ఉల్లాసాన్ని ఆహ్వానించండి