Saaga of Telephone
నీ ముందు నేనో నా ముందు నువ్వో
ఉండి మాట్లాడే సమయానికి
ఎప్పుడో చరమగీతం పాడేసింది కాలగమనం
ఎదో డబ్బాపై తీగలతో ముడివేసుకుని
నిన్ను పిలవాలని కాలం తిరిగినట్లు ఓ రోటరీ డయల్ ని
గింగిర్లు తిప్పుకుంటూ కటకటమని శబ్దాలు చేస్తూ నిన్నునన్ను
మాటల్లో కలిపి కాలగర్భం లో కలిసిపోయింది
మీట నొక్కితే బీప్ బీప్ మంటూ
నిన్ను నన్ను మాటల్లో ముంచి తేల్చే
యంత్రం ఎప్పుడో కనుమరుగున పడింది
తీగలు లేని ప్రపంచానికి నాంది పలుకుతూ
అరచేతిలో ఇమిడిపోయి వయ్యారాలు పోయింది,
నువ్వక్కడెక్కడో నొక్కితే నా దగ్గర ట్రింగ్ ట్రింగ్ మంటూ మ్రోగి
తెల్లమోహాన్ని వెలుగులతో నింపి నాట్యమాడెది.
రంగురంగులతో ముస్తాబయ్యి మురిసిపోతూ జిగేల్ మనిపించి
నీ పిలుపు వినిపించేది ఆ యాంత్రిక లో
2జి (GSM/EDGE), 3జి (HSPA), 4జి (LTE ) అంటూ జేనిరేషన్లూ మారుస్తూ
తను మారుతూ, ఊహలకే అందని మెరుపులా మెరుస్తూ క్షణ కాలంలో
నిన్ను పరోక్షంగా ప్రత్యక్షంగా నా ఎదుట నిలబెట్టింది తన పరిమాణం చిన్నది చేస్తూ
(లోకాన్నే మార్చేసిన టెలిఫోన్ కు అంకితమిస్తూ ... )